దుర్గమ్మ పూజలలో భాగం గా 115 మంది బాలికలతో బాల పూజ

దుర్గమ్మ పూజలలో భాగం గా 115 మంది బాలికలతో  బాల పూజ

లాస్ యాంజెలిస్ నగరం లో కోస్టా మేశా ఏరియాలో వున్నశివ కామేశ్వరి దేవాలయం లో ఆదివారం, 29 మే 2022 న ఉదయం ప్రారంభం అయిన విజయవాడ కనక దుర్గమ్మ వారి పూజలు సాయంత్రానికి 3 బ్యాచ్ ల కుంకుమ పూజలతో, ఒక బ్యాచ్ శివ పార్వతి కళ్యాణం తో విజయవంతంగా నడిచాయి. 

ఆదివారం, 30 మే తేదీ ఉదయం 10.am న 115 మంది చిన్నారులతో (3 -10 సంవత్సరాల బాలికలు) అమ్మ వారి కి చేసిన బాల పూజ అందరికి ఆకర్షణీయం గా మారింది. దుర్గమ్మ వారు కూడా సరస్వతి అమ్మవారి అలంకరణ తో దర్శనం ఇచ్చారు. చిన్నారులు అందరూ పట్టు పరికిణి, పట్టు గౌన్ లతో హిందూ సాంప్రదాయ పద్దతి తో తయారయి రావటం  అందరికి ఆకర్షణీయంగా మారింది, 

శివ కామేశ్వరి దేవాలయం చైర్మన్ శ్రీ చంద్రశేఖర శర్మ సామవేదుల పిల్లలందరి చేత పాఠశాల లో లాగ కొన్ని శ్లోకాలు చెప్పించి, పిల్లలకు ఈ బాల పూజ విశిష్టతను వివరించారు. సరస్వతి రూపంలో వున్నా దుర్గమ్మ వారి కి పురోహితులు కుంకుమార్చన చేసిన తరువాత పిల్లలందరూ వరస లో వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకొన్నారు. 


Click here for Event Gallery

 

 

Tags :