బాల్టిమోర్ నగరం-ఎలికాట్ సిటీ ఏరియా లో షిర్డీ సాయి మందిర్ లో చండీ హోమం

బాల్టిమోర్ నగరం-ఎలికాట్ సిటీ ఏరియా లో  షిర్డీ సాయి మందిర్ లో చండీ హోమం

విజయవాడ నుంచి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి పురోహితులు ఎలికాట్ సిటీ లోని షిర్డీ సాయి మందిర్ లో ఆది - సోమ వారాలలో (5 - 6 జూన్ తేదీలు) దుర్గమ్మ వారి కుంకుమ పూజలు, శివ పార్వతి కళ్యాణం వైభవంగా చేసిన సంగతి తెలిసినదే.

ఈ పూజలకు ముగింపు గా మంగళవారం సాయత్రం 5గంటలకు చండీ హోమం చాలా శాస్త్రోక్తంగా, అత్యంత విశేషం గా నిర్వహించారు.

మంగళ వారం, ఆఫీస్ రోజు అయినా దాదాపు 400 మంది భక్తులు రావటం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది అని, ఇంత ఘనం గా ఈ పూజలు నిర్వహించిన దుర్గ గుడి పూజారులకు, ఈ కార్యక్రమం చేయటానికి సహాయం అందించిన దాతలకు షిర్డీ సాయి మందిర్ చైర్మన్, శ్రీ దేశాయ్ సిద్దాబతుల కృతజ్ఞతలు తెలిపారు.

అమ్మ వారి పూజలలో చండీ హోమం చాలా విశిష్టమైనది అని, ఈ పూజలలో మహా కాళీ, మహా లక్ష్మి, మహా సరస్వతి అమ్మ వార్లు కలిసి వుంటారని, 700 శ్లోకాలతో పూజ జరుగుతుందని, ఈ హోమం చేసిన వారికి శత్రు భాధలు పోయి, అన్నింటా విజయం లభిస్తుందని దుర్గ గుడి ప్రధాన పురోహితులు శ్రీ శంకర శాండీల్య తెలిపి, భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అంద చేశారు.

 

Click here for Event Gallery

 

 

Tags :