బాల్టిమోర్ లో షిర్డీ సాయి మందిర్ లో దుర్గమ్మ పూజలు..

బాల్టిమోర్ లో షిర్డీ సాయి మందిర్ లో దుర్గమ్మ పూజలు..

అమెరికా లో జైత్ర యాత్ర సాగిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ వారు ఆదివారం, 5 జూన్ తేదీన మేరీ ల్యాండ్ రాష్ట్రం లోని బాల్టిమోర్ పట్టణం లో ఏలికాట్ ఏరియా లో వున్న షిర్డీ సాయి మందిర్ లో సాత్కర్షించి భక్తులను అలరించారు.

షిర్డీ సాయి మందిర్ చైర్మన్ శ్రీ సిద్దా బత్తుల దేశాయ్ మాట్లాడుతూ ఈ విధంగా గా దుర్గమ్మ వారి పూజలు అమెరికా లో తెలుగు వారికోసం ఏర్పాటు చేసిన దేవాదాయ శాఖను, దుర్గా మల్లేశ్వర దేవస్థానం అధికారులను అభినందించారు.

ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ ఎన్ అర్ ఐ విభాగ సలహాదారు శ్రీ సుబ్బా రావు చెన్నూరి మాట్లాడుతూ దేవాదాయ శాఖ ప్రవేశ పెట్టిన ఇ హుండీ, ఇ డొనేషన్, పరోక్ష సేవ పథకాలను వివరించి ప్రస్తుతం దాదాపు 200 గుడులలో 500 సేవలు ఆన్ లైన్ ద్వారా అందుబాటులో వున్నాయని తెలిపారు. మా ఊరు - మా గుడి పథకం కింద ఆంధ్ర రాష్ట్రం లో వున్న గుడుల పునరుద్దరణ లో ఎన్ అర్ ఐ లు ముందుకు రావాలని కోరారు.

అత్యంత వైభవంగా జరిగిన శివ పార్వతి కళ్యాణం 

ఎలికాట్ ఏరియా లో 50మంది పైగా దంపతులు వచ్చి భక్తితో శివ పార్వతి కళ్యాణం లో పాల్గొనటం చాలా సంతోషం గా వున్నదని, 6 జూన్ సాయత్రం అమ్మవారి కుంకుమార్చన వుంటుందని, 7 జూన్ తేదీ సాయత్రం చండీయాగం వుంటుందని అందరూ ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని శ్రీ దేశాయ్ కోరారు. షిర్డీ సాయి మందిర్ అధ్యక్షులు శ్రీ ప్రకాష్ కర్రీ దుర్గమ్మ వారి పూజలు ఇంత ఘనం గా జరగటానికి సహాయ పడిన స్పాన్సర్స్ కి ధన్యవాదాలు తెలిపారు.

 

Click here for Event Gallery

 

 

 

Tags :