లాస్ ఏంజలిస్ లో శివ కామేశ్వరి దేవాలయం లో దుర్గమ్మ వారు

లాస్ ఏంజలిస్ లో శివ కామేశ్వరి దేవాలయం లో దుర్గమ్మ వారు

కనక దుర్గమ్మ వారి పూజలు లాస్ ఏంజలిస్ లో ప్రసిద్ది గాంచిన శివ కామేశ్వరి దేవాలయం లో 29-30-31 మే తేదీలలో (ఆది - సోమ - మంగళ వారం) జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

దుర్గమ్మ దేవస్థానం నుంచి వచ్చిన అమ్మ వారి దర్శనం తో 29 మే తేదీ ఆదివారం ఉదయం 9.30am నుంచి దుర్గమ్మ వారి పూజలు మొదలయ్యాయి.

ఈ దేవాలయం వారు మూడు రోజులలో జరిగే వివిధ కార్య క్రమాలను You Tube ద్వారా LIVE ఇస్తున్నారు.

ఫౌండర్ చైర్మన్ శ్రీ చంద్రశేఖర శర్మ సామవేదుల మాట్లాడుతూ శివ కామేశ్వరి దేవాలయం లాస్ ఏంజలిస్ లో అందరికీ తెలిసిన అమ్మవారి గుడి అని, ఆ గుడి కి విజయవాడ నుంచి దుర్గమ్మ వారు రావటం అదృష్టం అని తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ కి NRI Wing కు సలహాదారు శ్రీ సుబ్బారావు చెన్నూరి గత సంవత్సరం దేవాదాయ శాఖ ప్రారంభించిన eHundi, eDonation, పరోక్ష సేవ, మా ఊరు - మా గుడి, విదేశాల్లో హిందూ దేవాలయాలు - రాష్ట్ర సహకారం ల గురించి వివరించారు.

ఉదయం రెండు బ్యాచ్ లతో కుంకుమార్చన ల తరువాత సాయత్రం అత్యంత వైభవంగా శివ పార్వతి కళ్యాణం నిర్వహించారు.

మధ్యలో 2pm- 4pm సమయం లో 30 మంది బాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించటం విశేషం.

 

Click here for Event Gallery

 

 

Tags :