నిరసనలో కూడా కరోనా దూరం పాటించారు!

నిరసనలో కూడా కరోనా దూరం పాటించారు!

కరోనా వైరస్‍ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మనుష్యుల మధ్య దూరం ఉండాల్సిందేనని వైద్యులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తుండటంతో ప్రజలంతా దీనికి అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అంటే నిరసన తెలియజేయడంలో కూడా భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. ఇజ్రాయిల్‍ దేశపు రాజధాని టెల్‍ అవీవ్‍లో లాక్‍డౌన్‍ ఎత్తివేయమని దాదాపు 2000 మంది నిరసనకారులు టెల్‍అవీవ్‍స్‍లోని రాబిన్‍ స్క్వేర్‍ వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్‍ పేరుతో లాక్‍డౌన్‍ విధించారని, వెంటనే దానిని ఎత్తివేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా నిరసన కారులు ఒక్కొక్కరు తమ మధ్య దాదాపు 6 అడుగుల దూరం ఉండేలా చూసుకుని మరీ నిరసన వ్యక్తం చేయడం గమనార్హం.

Tags :