ఏఐ హబ్‌లో హైదరాబాద్‌కు స్థానం!

ఏఐ హబ్‌లో హైదరాబాద్‌కు స్థానం!

ప్రపంచంలోని టాప్‌-25 కృత్రిమ మేధ (ఏఐ) ఇన్నోవేషన్‌ హబ్‌లలో హైదరాబాద్‌కు స్థానం దక్కాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 2030 నాటికి ప్రపంచ జీడీపీలో ఏఐ వాటా దాదాపు 40 శాతం ఉంటుందని ఆయన అంచనా వేశారు. కృత్రిమ మేధను ఎలా శక్తిమంతం చేయాలనే అంశంపై దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌స ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు సందర్భంగా నిర్వహించిన ప్యానెల్‌ డిస్కషన్‌లో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ రంగంలో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదిని కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు.

దీనిద్వారా కీలకమైన వ్యూహాత్మక భాగస్వాముల్ని ఏర్పాటు చేసుకునేందుకు వీలుకలుగుతుందని, ఈ క్రమంలో సమన్వయంతో కూడిన కార్యక్రమాలను చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం ఏఐ విస్తరణ గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రాష్ట్రంలో పౌర సేవలను మరింత మెరుగ్గా అందించడంతో పాటు జీ2సీ చాట్‌బాట్‌ల ఏర్పాటు, సరుకు రవాణా, క్రౌడ్‌ కౌంటింగ్‌, క్రిమినల్‌ ట్రాకింగ్‌ తదితర కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత వ్వవస్థలను తీసుకొచ్చిందన్నారు.

 

 

Tags :