కొలంబస్‌లో నరేన్‌ కొడాలి ప్రచారం సక్సెస్‌ - సత్తా చాటిన జగదీష్‌ ప్రభల

కొలంబస్‌లో నరేన్‌ కొడాలి ప్రచారం సక్సెస్‌ - సత్తా చాటిన జగదీష్‌ ప్రభల

కొలంబస్‌లోనూ, ఒహాయోలోనూ తానా వైస్‌ప్రెసిడెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నరేన్‌ కొడాలి, తన టీమ్‌తో కలిసి  చేసిన పర్యటన విజయవంతమైంది. ప్రస్తుత తానా ఎన్నికల్లో ట్రెజరర్‌ పదవికి పోటీ పడుతున్న కొలంబస్‌వాసి జగదీష్‌ ప్రభల ఈ పర్యటనను విజయవంతమయ్యేలా కృషి చేశారు. నరేన్‌ కొడాలి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి కోవిడ్‌ కారణంగా 50మందికన్నా ఎక్కువరారని భావించినప్పటికీ జగదీశ్‌ ప్రభలతో ఉన్న మైత్రీ కారణంగా, నరేన్‌, సతీష్‌ వేమనతో ఉన్న సాహచర్యం కారణంగా ఎంతోమంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దాదాపు 242 మంది హాజరవడంతో నరేన్‌ కొడాలి ప్యానెల్‌కు బలం వచ్చినట్లుగా కనిపించింది. నరేన్‌ కొడాలి, రవి పొట్లూరి, విజయ్‌ గుడిసేవ, రవి మందలపు, మన్నే సత్యనారాయణ, రాజా సూరపనేని, జగదీష్‌ ప్రభల, భక్త భల్లా, సునీల్‌ పంత్ర, అనిల్‌ ఉప్పలపాటి, సతీష్‌ తుమ్మల, సునీల్‌ కోగంటి తదితరులు హాజరయ్యారు.

నరేన్‌ కొడాలి ప్యానెల్‌కు మద్దతు ప్రకటించేందుకు దాదాపు సెంట్రల్‌ ఒహాయోలోని 14మంది మాజీ టాకో ప్రెసిడెంట్‌లు కూడా కార్యక్రమానికి రావడం నరేన్‌ ప్యానెల్‌కు హషారునిచ్చింది. గణేష్‌ వాత్యం, తేజో వట్టి, ప్రకాష్‌ పేరం, వంశీ కోర, సంగ శ్రీనివాస్‌, సురేష్‌ పూదోట, అంజు వల్లభనేని, అశోక్‌ కామినేని, వెంకట్‌ పత్తిపాటి, మన్నె నాగేశ్వరరావు, శ్రీకాంత్‌ మునగాల, జగన్‌ చలసాని, ప్రదీప్‌ చందనం తదితరులు జగదీష్‌ ప్రభలకు, ప్యానెల్‌కు తమ మద్దతును ప్రకటించారు. అలాగే ఎఫ్‌ఐఎ ప్రెసిడెంట్‌లుగా పనిచేసిన రామకృష్ణ, రజనీకాంత్‌, సిటిఎ ప్రెసిడెంట్‌లుగా పనిచేసిన వంశీ, రామకృష్ణ, ఐటీ సర్వ్‌ ఒహాయో ఛాప్టర్‌ హెడ్‌ అశోక్‌, అమెరికా ఒహాయో సెనెటర్‌ నీరజ్‌ అంటాని కూడా సతీష్‌ను, నరేన్‌ కొడాలిని కలిశారు. 2019 కాన్ఫరెన్స్‌ విజయవంతానికి సతీష్‌, నరేన్‌ చేసిన హార్డ్‌వర్క్‌ను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరేన్‌ ప్యానెల్‌ విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఆప్కో, సిడబ్ల్యుసిసి, ఆటా, నాటా, నాట్స్‌, ఆప్తా, కొలంబస్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు తదితరులు ఈ ప్రచార కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా నరేన్‌ కొడాలి మాట్లాడుతూ, అందరినీ కలుపుకుపోతూ, ముందడుగు వేస్తున్నామని, మీరంతా మద్దతు ఇచ్చి తమను గెలిపించాలని కోరారు. నాయకుడి ఆదర్శాలు భావాలను ఆకళింపు చేసుకునే జట్టు దొరకడం వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సమస్యలు ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించే మార్గాలపై ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చ జరగాలని తద్వారా సంస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని నరేన్‌ అన్నారు. తనకు తన ప్యానెల్‌కు అవకాశం కల్పిస్తే ఇలాంటి మార్గదర్శకాలకు పెద్దపీట వేసి, సంస్థ కోసం కష్టపడె వారిని గౌరవించే  సాంప్రదాయానికి నాంది పలుకుదామని అన్నారు. 

జగదీష్‌ ప్రభల మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడం చూస్తుంటే మా టీమ్‌పై మీకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని. తమ గెలుపుకు ఇది శుభసూచకమని అన్నారు. అందరూ నరేన్‌ ప్యానల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అభ్యర్థులు కూడా మాట్లాడారు.

Tags :