తానాను సరైన దిశలో నడిపిస్తా - నరేన్ కొడాలి

తానాను సరైన దిశలో నడిపిస్తా - నరేన్ కొడాలి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్‍ కమిటీ ఎన్నికల్లో వైస్‍ ప్రెసిడెంట్‍ పదవికి పోటీ పడుతున్న నరేన్‍ కొడాలి తన ప్రచార కార్యక్రమాన్ని ఉధృతం చేశారు. తన ప్యానెళ్ల అభ్యర్థులతో కలిసి వివిధ చోట్ల పర్యటిస్తున్నారు. న్యూజెర్సీ, బోస్టన్‍లలో ప్రచారాన్ని ముగించిన తరువాత మేరీలాండ్‍లో కూడా పర్యటించి అక్కడి సభ్యుల మద్దతును అభ్యర్థించారు. స్థానిక ఆప్తా, వారధి సంస్థల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొడాలి నరేన్‍, ఆయన ప్యానెల్‍ అభ్యర్థులు గుడిసేవ విజయ్‍, అనిల్‍ ఉప్పలపాటి, సత్యనారాయణ మన్నే పాల్గొన్నారు. విద్యాధికుడైన నరేన్‍ వంటి నాయకుడి అవసరం తానాకు ఉందని కార్యక్రమానికి హాజరయిన వక్తలు పేర్కొని తమ మద్దతును ప్రకటించారు. తానాను సరైన దిశలో నడిపించడానికి తన నాయకత్వంలోని ప్యానెల్‍ కట్టుబడి ఉందని అందరూ తమ ప్యానెల్‍ అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు.

 

Tags :