ఎన్నికల ప్రచారయాత్రలో నిరంజన్ శృంగవరపు టీమ్

ఎన్నికల ప్రచారయాత్రలో నిరంజన్ శృంగవరపు టీమ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రస్తుత తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు తన ఎన్నికల ప్రచారయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా చికాగోలో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరుతూ, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఏఏ కార్యక్రమాలను చేపట్టనున్నారో తెలియజేశారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా, అంతకుముందు తానా కమిటీ సభ్యునిగా తాను చేసిన సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. తానాలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో తానా 4 ఛేంజ్‌ పేరుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రజనీ ఆకురాతి, జగదీష్‌ కానూరు, మిడ్‌వెస్ట్‌ ప్రాంతీయ ప్రతినిధి అభ్యర్థి కొమ్మాలపాటి శ్రీధర్‌(బాబీ), బొప్పన శ్రీనివాస్‌, అనుమోలు రవిచంద్ర తదితరులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

 

Tags :