డల్లాస్ ప్రాంతంలో నిరంజన్ ప్రచారానికి మంచి స్పందన

డల్లాస్ ప్రాంతంలో నిరంజన్ ప్రచారానికి మంచి స్పందన

తానా ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ చేస్తున్న నిరంజన్‌ శృంగవరపు తన ప్రచార యాత్రలో భాగంగా డల్లాస్‌ ఫోర్త్‌వర్త్‌లో పర్యటించారు. స్థానిక తెలుగు ప్రముఖుడు మల్లవరపు అనంత్‌ నివాసంలో సౌత్‌లేక్‌ ప్రాంతంలో ఉంటున్న తానా సభ్యులను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు.

ఫ్రిస్కోలో...

తన ప్రచారయాత్రలో భాగంగా ఫ్రిస్కోలో కూడా నిరంజన్‌ శృంగవరపు పర్యటించారు. తానా ఒకవర్గానికి మాత్రమే సొంతం కాదని అందరిదని, అందులోనూ పనిచేసేవాళ్ళనే తప్పుకోమనడం ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా నిరంజన్‌ శృంగవరపు ప్రశ్నిస్తూ, కొందరి పెత్తనాలకు దూరంగా తానాను నిలబెట్టాలన్న ఉద్దేశ్యంతో పోటీ చేస్తున్నామని చెప్పారు.  

ఇర్వింగ్‌లో...

ఇర్వింగ్‌లో పర్యటించి కృష్ణా జిల్లాకు చెందిన తానా నాయకులు, సభ్యులతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో తనను గెలిపించి తానాలో మార్పునకు నాంది పలకవలసిందిగా కోరారు. తన పూర్వీకులది కృష్ణా జిల్లా అని, వ్యవసాయం నిమిత్తం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వెళ్లి తాము స్థిరపడ్డామని తానాలో కృష్ణా జిల్లా ప్రవాసులది ప్రత్యేక స్థానమని అంటూ కొనియాడారు. వ్యవస్థాపక అధ్యక్షులు డా.కాకర్ల సుబ్బారావుతో మొదలుపెట్టి తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి వరకు తానాలో పలు కీలక పదవుల్లో సేవలందించి సంస్థను అగ్రపథాన నిలిపిన వారి గురించి ప్రస్తావించేటప్పుడు కృష్ణా జిల్లా గురించే ముందుగా చెప్పాల్సి ఉంటుందని  కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో ఆయన ప్యానెల్‌ అభ్యర్థులు డా.ఉమా కటికి, శిరీష తూనుగుంట్ల, శశాంక్‌ యార్లగడ్డ, నిమ్మలపూడి జనార్ధన్‌, తాళ్లూరి మురళీ, పోలవరపు శ్రీకాంత్‌, రాజా కసుకుర్తి, సుమంత్‌ రామిశెట్టి, గుదే పురుషోత్తమ చౌదరి, హితేష్‌ వడ్లమూడి, వేమూరి సతీష్‌, తానా ప్రతినిధులు జయశేఖర్‌ తాళ్లూరి, చలసాని కిషోర్‌, అడుసుమిల్లి రాజేష్‌, చాగర్లమూడి సుగన్‌, యలమంచిలి రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :