తానా ఎన్నికలు - కార్యదర్శిగా సతీష్‌ వేమూరి ఏకగ్రీవ ఎన్నిక

తానా ఎన్నికలు - కార్యదర్శిగా సతీష్‌ వేమూరి ఏకగ్రీవ ఎన్నిక

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో ఊహించని విధంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన ముగియడంతో తానా ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలను ప్రకటించింది. తానా కార్యదర్శిగా సతీష్‌ వేమూరి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఆయన నిరంజన్‌ శృంగవరపు ప్యానల్‌ తరపున బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా నామినేషన్‌ వేసిన నరేన్‌ కొడాలి వర్గానికి చెందిన భక్తబల్లా నామినేషన్‌ను ఎన్నికల కమిటీ తిరస్కరించింది. ఫౌండేషన్‌ ట్రస్టీగా ఆయన పదవీకాలం 2023 వరకు ఉండటం వల్ల, ఆయన రాజీనామా చేసినట్లు చెప్పినప్పటికీ ఆ రాజీనామా సరైన సమయంలో అందలేనందున భక్తబల్లా నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల కమిటీ చైర్మన్‌ కనకంబాబు ఐనంపూడి తెలిపారు.

Tags :