ఆటా వేడుకలకు సునీల్‌ గవాస్కర్‌, చంద్రబోస్‌, తమన్‌ రాక

ఆటా వేడుకలకు సునీల్‌ గవాస్కర్‌, చంద్రబోస్‌, తమన్‌ రాక

అమెరికా తెలుగు సంఘం (ఆటా)17వ ఆటా మహసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహాసభల కోసం ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారంతా అమెరికాకు చేరుకుంటున్నారు. పదివేలమందికిపైగా హాజరవుతారని భావిస్తున్న ఆటా మహాసభలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు వాషింగ్టన్‌ డీసీకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌ ప్రముఖులు తమన్‌, చంద్రబోస్‌, శివారెడ్డి, సింగర్‌ మంగ్లీ ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు సునీల్‌ గవాస్కర్‌, తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తదితరులు వాషింగ్టన్‌డీసికి వచ్చారు. ఇంకా పలువురు తరలి వస్తున్నట్లు ఆటా నాయకులు తెలిపారు..

 
Tags :