నామినేషన్ ల తిరస్కరణ నిర్ణయాన్ని సమర్థించిన తానా బోర్డ్

నామినేషన్ ల తిరస్కరణ నిర్ణయాన్ని సమర్థించిన తానా బోర్డ్

ఉత్తర అమెరికా తెలుగు సంఘం 2021 ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలనలో భాగంగా కార్యదర్శి పదవికి నామినేషన్‍ వేసిన భక్తబల్లా నామినేషన్‍ నియమనిబంధనలకు లోబడి లేకపోవడంతో దానిని తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే హేమ కానూరు నామినేషన్‍ను కూడా ఎన్నికల కమిటీ తిరస్కరించింది. దీంతో వారు ఈ విషయమై తానా బోర్డ్ కు అప్పీల్‍ చేశారు. తమ నామినేషన్‍లు సక్రమమేనని వారు విన్నవించారు. దీనిపై చర్చించిన బోర్డ్ ఎన్నికల కమిటీ నిర్ణయాన్ని సమర్థించినట్లు సమాచారం. మరోవైపు ఈ విషయంలో బోర్డ్ లో ఉన్న సభ్యులు కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో వారిని ఓటింగ్‍కు దూరంగా ఉంచినట్లు తెలిసింది. భక్తబల్లా నామినేషన్‍ను తిరస్కరించడంతో ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేసిన సతీష్‍ వేమూరి కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Tags :