సియాటెల్‍లో తానా కౌంటింగ్...విజేత ఎవరో?

సియాటెల్‍లో తానా కౌంటింగ్...విజేత ఎవరో?

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఎగ్జిక్యూటివ్‍ కమిటీ 2021-23 సంవత్సరానికిగాను నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మరికొన్నిగంటల్లో వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల కోసం తానా బోర్డ్ ముగ్గురు సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే ఎన్నికల బ్యాలెట్ల పంపిణీ ఓట్ల లెక్కింపును సియాటెల్‍లోని ఎలక్షన్‍ ట్రస్ట్ సంస్థకు అప్పగించింది. అందరూ ఎదురుచూసిన క్షణం రానే వచ్చింది. ఈ ఎన్నికల్లో తానా ఎగ్జిక్యూటివ్‍ కమిటీ అధ్యక్ష పదవికి నిరంజన్‍ శృంగవరపు, నరేన్‍ కొడాలితోపాటు శ్రీనివాస గోగినేని పోటీ పడిన సంగతి తెలిసిందే. ప్రధాన పోటీ మాత్రం నిరంజన్‍ శృంగవరపు, నరేన్‍ కొడాలి టీమ్‍ మధ్యనే జరిగింది. పోటాపోటీ ప్రచారం, వివిధ నగరాల్లో అభ్యర్థుల టూర్‍ వంటివి తానా సభ్యులను ఏ విధంగా ఆకట్టుకున్నాయనే విషయం ఈ ఫలితాల్లో తేలిపోనున్నది. ఈ ఎన్నికల కౌంటింగ్‍ను చూసేందుకు ఇప్పటికే తానా నాయకులంతా సియాటెల్‍కు చేరుకున్నట్లు తెలిసింది.

 

Tags :