తానా ఎన్నికలు... బ్యాలెట్ కౌంటింగ్

తానా ఎన్నికలు... బ్యాలెట్ కౌంటింగ్

ఉత్తర అమెరికా సంఘం (తానా) ఎన్నికల్లో చివరి అంకం పూర్తవుతోంది. ఎన్నికల బ్లాలెట్ల కౌంటింగ్ సియాటెల్‌లో ప్రారంభమైంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 8:30 లేదా ఆ తరువాత ఫలితాలు వెలువడవచ్చని భావిస్తున్నారు. కౌంటింగ్ ప్రక్రియను చాలా జాగ్రత్తగా చేపట్టారు. ఎటువంటి వివాదానికి తావు ఇవ్వకుండా తానా బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతోంది.

తొలుత బ్యాలెట్ పేర్లను తపాలా కార్యాలయం నుంచి బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. తరువాత బ్యాలెట్లను విభజించారు. డూప్లికేట్ లేకుండా బ్యాలెట్ కవర్లను స్కానింగ్ చేశారు. దాదాపు 10877 కవర్లను స్కాన్ చేశారు. బ్యాలెట్ బార్‌కోడ్‌ను పరిశీలించిన తరువాత లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. కాగా 10877 కవర్లు సాధారణ ఎన్నికలకు సంబంధించినవి కాగా, 57 కవర్లు ఫౌండేషన్ ట్రస్టీ ఎన్నికల్లో భాగంగా డోసర్ కోటాకు చెందినవి. మొత్తం కలిపి 10934,10877 కవర్లలో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది లెక్కింపు పూర్తయ్యాక తెలియనున్నది.

ఈ ఎన్నికల్లో తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్ష పదవికి నిరంజన్ శృంగవరపు, నరేన్ కొడాలితో పాటు శ్రీనివాస గోగినేని పోటీ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన పోటీ మాత్రం నిరంజన్ శృంగవరపు, నరేన్ కొడాలి టీమ్ మధ్యనే జరిగింది. పోటాపోటీ ప్రచారం, వివిధ నగరాల్లో అభ్యర్థుల టూర్ వంటివి తానా సభ్యులను ఏవిధంగా ఆకట్టుకున్నాయనే విషయం ఈ ఫలితాల్లో తేలిపోనున్నది. ఈ ఎన్నికల కౌంటింగ్‌ను చూసేందుకు ఇప్పటికే తానా నాయకులంతా సియాబెల్‌కు చేరుకున్నారు. 

 

Tags :