MKOne Telugu Times Youtube Channel

తానా ఎన్నికల ప్రకటనలో మార్పులు..నామినేషన్‌ గడువు పొడిగింపు

తానా ఎన్నికల ప్రకటనలో మార్పులు..నామినేషన్‌ గడువు పొడిగింపు

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో ఎగ్జిక్యూటివ్‌ కమిటి, బోర్డ్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా గతంలో నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని విషయాల్లో ముఖ్యంగా కోర్డు వ్యవహారాల కారణంగా సభ్యులు కొందరు నామినేషన్‌ గడువును పొడిగించాలని బోర్డ్‌ను కోరారు. ఇందుకోసం బోర్డ్‌ ప్రత్యేకంగా సమావేశమై నామినేషన్‌ గడువును ఇతర తేదీల గడువును పొడిగించింది. 

జనవరి 31 ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల, ఫిబ్రవరి 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మార్చి 2న అభ్యర్థుల నామినేషన్‌ ధ్రువపత్రాల పరిశీలన తరువాత సమాచారం ఇస్తారు. మార్చి 9వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా పేర్కొన్నారు. మార్చి 12న పోటీ చేస్తున్న అభ్యర్థుల లిస్ట్‌ను ప్రకటిస్తారు. మార్చి 15లోగా ఎన్నికల ఫ్లయర్‌ను పంపించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 21 వరకు బ్యాలెట్‌ పత్రాలను స్వీకరిస్తారు, ఏప్రిల్‌ 22 ఓట్ల లెక్కింపు, ఏప్రిల్‌ 23న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుందని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

 

 

 

Tags :