పెన్సిల్వేనియాలో తానా నాయకులు...మహాసభల వేదిక పరిశీలన

పెన్సిల్వేనియాలో తానా నాయకులు...మహాసభల వేదిక పరిశీలన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వచ్చే సంవత్సరం జూలై నెలలో నిర్వహించే మహాసభలకు వేదికగా పెన్సిల్వేనియాలోని కన్వెన్షన్‌ సెంటర్‌ను వేదికగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహాసభలు జరిగే కన్వెన్షన్‌ సెంటర్‌ను తానా నాయకులు సందర్శించారు. సెంటర్లో ఉన్న సదుపాయాలు, సౌకర్యాలను తెలుసుకున్నారు. తానా మహాసభల కన్వీనర్‌ పొట్లూరి రవి ఈ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉన్న ఏర్పాట్లను నాయకుల బృందానికి వివరించారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌, తానా ప్రతినిధులు లక్ష్మీ దేవినేని, శ్రీని లావు, శ్రీ చౌదరి, రవి మందలపు, విద్య గారపాటి, రాజా కసుకుర్తి, హరీష్‌ కోయ, సునీల్‌ కోగంటి, జాని నిమ్మలపూడి, వంశీ వాసిరెడ్డి, శ్రీనివాస్‌ ఓరుగంటి, సతీష్ తుమ్మల, శ్రీ అట్లూరి తదితరులు వేదికను పరిశీలించిన వారిలో ఉన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :