కరోనా సేవా కార్యక్రమాల కోసం టీమ్ నిరంజన్ లక్ష డాలర్ల విరాళం

కరోనా సేవా కార్యక్రమాల కోసం టీమ్ నిరంజన్ లక్ష డాలర్ల విరాళం

ప్రస్తుత తానా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రస్తుత తానా ఫౌండేషన్‍ చైర్మన్‍ నిరంజన్‍ శృంగవరపు కరోనా సెకండ్‍వేవ్‍తో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను ఆదుకునేందుకు తన టీమ్‍తో కలిసి సేవా కార్యక్రమాలకోసం లక్ష డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్‍ వేవ్‍ విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలుగు వారికి సహాయంగా టీమ్‍ నిరంజన్‍ మరియు ఫ్రెండ్స్ తరుపున లక్ష డాలర్లు విరాళంగా ఇస్తున్నట్లు విడుదల చేసిన ఓ ప్రకటనలో నిరంజన్‍ శృంగవరపు తెలిపారు. ఈ మొత్తాన్ని అతి త్వరలో తానా ఫౌండేషన్‍కి అందజేస్తాం. తెలుగువారి సేవ కోసం వినియోగిస్తాం. దీంతోపాటు తెలుగు కమ్యూనిటీలో ఉన్న పెద్దలు ముందుకు వచ్చి తమ వంతు సహాయాన్ని అందించాలని మేము  కోరుకుంటున్నాం. కోవిడ్‍ ఫస్ట్ వేవ్‍ సందర్భంగా లక్ష డాలర్లు వ్యక్తిగతంగా విరాళాలు సేకరించి ఇచ్చాము. అలాగే మూడు కోట్ల రూపాయలకు పైగా విరాళాలు సేకరించి తానా ఫౌండేషన్‍ ద్వారా పదిహేను స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయంతో ఒక లక్ష కుటుంబాలకు నిత్యావసర సరుకుల కిట్లు అందజేయడం జరిగింది. మూడు లక్షల మందికి అన్నదానం చేశాం. ఆరు లక్షల మందికి మాస్కులు అందించాం. తెలుగువారి సేవ కోసం టీం నిరంజన్‍ ఎప్పుడూ ముందు ఉంటుంది. వారికి ఎటువంటి ఆపద ఎదురైనా సహాయం చేయడానికి, ఆదుకోవటానికి నడుంబిగించి కదులుతుంది అని ఆ ప్రకటనలో వివరించారు.

Tags :