చనిపోయిన బాడీలను తీసుకెళ్ళే ప్రొఫెసర్

చనిపోయిన బాడీలను తీసుకెళ్ళే ప్రొఫెసర్

న్యూయార్క్ రాష్ట్రంలో ముఖ్యంగా న్యూయార్క్ మహానగరంలో ప్రతిరోజు వందల సంఖ్యలో కరోనా రోగులు చనిపోతున్న సంగతి తెలిసిందే. మరణాల సంఖ్య బాగా పెరిగిపోవడంతో రాష్ట్రంలో ఉన్న క్రిమోటోరియంలు (శవ దహన కేంద్రాలు) క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తున్నా, ఇంకా అనేక బాడీలు దహనానికి నోచుకోక కోల్డ్ స్టోరేజ్‍లో పడి ఉన్నాయి. డేవిడ్‍ పెనెపెట్‍ అనే మార్చురీ సైన్స్ ప్రొఫెసర్‍, ఆయన దగ్గర చదువుకునే ఇద్దరు విద్యార్థులతో ఒక వ్యాన్‍లో గత నాలుగువారాలుగా శవదహనానికి సిద్ధంగా ఉండి, టైమ్‍ దొరక్క వెయిటింగ్‍లోఉన్న బాడీలను న్యూయార్క్ నుంచి తీసుకుని హైవేలో ఇతర రాష్ట్రాలకు పెన్సిల్వేనియా, వెర్మాంట్‍ లాంటి చోట్లకు వెళ్ళి అక్కడ ఉన్న క్రిమెటోరియంలలో కార్యక్రమాలు నిర్వహించి చనిపోయినవారి బంధుమిత్రులకు సహాయం చేస్తున్నారు.

ప్రొఫెసర్‍ డేవిడ్‍ పెనెపెట్‍కు అభినందనలు.

 

Tags :