వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. డల్లాస్‌ నగరంలో ముఖ్యమంత్రి పాల్గొనబోయే ప్రాంగణాన్ని, ఏర్పాట్లను తుడా చైర్మన్‌, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వం కార్యక్రమం కాకున్నా ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్‌ ఆగస్టు 17న ప్రసిద్ధిగాంచిన డల్లాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (కే బెయిలీ హచీసన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌)లో ప్రసంగించనున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఆయన అమెరికా పర్యటన కొనసాగనుంది.

 

 

Tags :