జగనన్న వసతి దీవెన ప్రారంభించిన సీఎం

జగనన్న వసతి దీవెన ప్రారంభించిన సీఎం

స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ప్రజల పరిస్థితి మారలేదని ఆంధప్రదేశ్‍ ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍ అన్నారు. మన రాష్ట్రంలో 33 శాతం నిరక్షరాస్యత ఉందని చెప్పారు. ప్రతి పేదవాని ఇంటి నుంచి పెద్ద చదువులు చదివి ఉన్నత స్థితికి చేరినప్పుడే ఆ పరిస్థితి మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరంలోని అయోధ్య మైదానంలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇంటర్‍ తరువాత విద్య చూస్తే బ్రెజిల్‍, చైనా వంటి దేశాల్లో 50 శాతం ఉంటే మన దేశంలో 25 శాతం మాత్రమే ఉందని, ఈ పరిస్థితి నుంచి దేశం బయటపడాలన్నారు. మన రాష్ట్రం నుంచే మార్పు రావాలిని, అందుకే విద్యావ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు. వసతి దీవెన కార్యక్రమం ద్వారా ఉన్నత చదువులు సజావుగా సాగాలన్నారు. డిగ్రీ, సాంకేతిక విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల వసతికి ఈ పథకం ఆసరాగా ఉంటుందన్నారు.

 

Tags :