ASBL Koncept Ambience
facebook whatsapp X

నాలుగు నెలల మౌనం తర్వాత.. యుద్ధానికి సై అంటున్న జగన్..

నాలుగు నెలల మౌనం తర్వాత.. యుద్ధానికి సై అంటున్న జగన్..

2024 ఎన్నికల (2024 elections) తరువాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాస్త బోరింగ్ గా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం జగనన్న సైలెంట్ గా ఉండడం. ఎన్నికలకు ముందు చంద్రబాబు (Chandra Babu) ప్రతి మాటకి కౌంటర్ ఇచ్చే జగనన్న (Jagan) గత నాలుగు మాసాలుగా మౌనముద్రలో ఉన్నారు. దీంతో మాట్లాడేది మొత్తం ఏకపక్షం అవ్వడం.. విభేదించేవారు లేకపోవడం.. కాస్త కొరతగా అనిపించేది. అయితే ఇప్పుడు జగన్ తన నాలుగు మాసాల మౌనవ్రతానికి ఎండ్ కార్డు వేసినట్లు కనిపిస్తోంది. 

తాజాగా ఉద్యమానికి పిలుపునివ్వడమే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూటమిపాలనకు.. తమ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని డోర్ టు డోర్ (Door to door program) తెలియజేయాలి అని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. అంతేకాదు ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న స్ట్రాంగ్ కౌంటర్ గా నాలుగు అంశాలను లేవనెత్తారు. బడ్జెట్, సూపర్ సిక్స్ (Super six) లాంటి పాయింట్స్ తో కౌంటర్ అటాక్ కి జగన్ సిద్ధమవుతున్నారు. వార్షిక బడ్జెట్ ను ( AP budget) కూటమి ప్రభుత్వం జూలైలోనే ప్రవేశపెట్టాలి. అయితే తాము చార్జ్ తీసుకునే సమయానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు అనే కారణంతో బడ్జెట్ సమావేశాలను పెట్టి కూడా వెనక్కి తీసుకున్నారు. అప్పటినుంచి వైసీపీ పాలనలో జరిగిన పలు అంశాలపై శ్వేత పత్రాలను విడుదల చేసి కాస్త మసిపూసి మారేడు కాయ చేశారు. ఇక అక్టోబర్ లో బడ్జెట్ పెడతామని చంద్రబాబు చెప్పారు. అయితే ఇప్పటివరకు దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. 

మరోపక్క ఎన్నికలకు ముందు ఇస్తామని చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.నిన్న మొన్నటి వరకు విజయవాడ వరదలతో సరిపెట్టారు.. ఇక ఇప్పటికైనా పథకాలను ప్రవేశపెడతారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు .ఈ పరిస్థితిని జగన్ తనకు అద్వాంటేజ్ గా మార్చుకుంటూ ప్రజలలో తిరిగి తన స్టార్ ఇమేజ్ ని తెచ్చుకోవడానికి ట్రై చేయబోతున్నారని టాక్. కూటమి ప్రభుత్వము లోటుపాట్లను ప్రజలకు తెలిసే విధంగా చేసి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి అనేదే జగన్ మాస్టర్ ప్లాన్ గా ఉంది. జగన్ నుంచి రాబోతున్న ఈ దాడికి కూటమి ఎలా ఎదురు వెళ్తుందో చూడాలి. మరి ముఖ్యంగా జగన్ కు ఇప్పటికీ ఎంతో కొంత స్ట్రాంగ్ ఫాలోయింగ్ ఉండనే నవరత్నాలు విడుదల అయినంత ఫాస్ట్గా సూపర్ సిక్స్ పథకాలు రావడం లేదు అని విమర్శించే వారు కూడా ఉన్నారు. ఈ క్రమంలో సూపర్ సిక్స్ పథకాలను పెద్ద చర్చనీయాంశంగా మార్చి జగన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళితే కూటమికి కష్టాలు తప్పవు.

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :