29 వసంతాలు పూర్తి చేసుకున్న రాంకీ రియల్ ఎస్టేట్
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ రాంకీ ఎస్టేట్స్ 29వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. మూడో దశాబ్దంలో అడుగు పెట్టిన ఈ సంస్థ.. 29 ఏళ్లుగా దక్షిన భారతదేశంలోని అతి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా పేరొందింది. హైదరాబాద్‌లోని రియల్ ఎస్టేట్ టైటాన్స్‌లో ఒకటిగా పేరొందిన ఈ సంస్థను 1995లో ప్రారంభించారు. ప్రముఖ నగరాల్లో 50కి పైగా రెసిడెన్షియల్ ప్రాజెక్టులను లాంచ్ చేయడం ద్వారా రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుందీ సంస్థ. 2005లో కమర్షియల్ సెక్టార్‌లో అడుగు పెట్టి, ఈ రంగంలో నమ్మకమైన సంస్థగా ఎదిగింది. అనంతరం పక్క రాష్ట్రాలకు కూడా వ్యాపించి, దక్షిన భారతదేశంలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది.
ఈ సంస్థ 29 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నంద కిషోర్ సంతోషం వ్యక్తం చేశారు. ‘మూడో దశాబ్దంలో అడుగు పెట్టడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రయాణంలో 9 వేలకుపైగా కుటుంబాలకు సేవలందించాం. వారి సంతోషమే మన సక్సెస్‌కు నిదర్శనం. వారందరి ఆశీస్సులతో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖమైన పేరుగా రాంకీ ఎదిగింది. దక్షిణ భారతం మొత్తంలో అడుగు పెట్టి సక్సెస్ చూసిన కంపెనీగా పేరొందడం నిజంగా సంతోషకరం’ అన్నారు.
రాంకీ గ్రూప్ సీఎఫ్‌ఓ ఎన్ఎస్ రావు కూడా ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో రియల్ ఎస్టేట్ పాత్ర చాలా పెద్దదని, దానిలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో తమ కంపెనీని మరింత విస్తృతం చేయడంలో భాగంగా రాంకీ నెక్స్‌టౌన్, రాంకీ వన్ ఓరియన్, రాంకీ వన్ ఒడిస్సీ, రాంకీ వన్ సింఫనీ, రాంకీ వన్ జెనెక్స్ట్, రాంకీ వన్ అస్త్ర వంటి ఎన్నో ప్రాజెక్టులను రాంకీ రియల్ ఎస్టేట్ ప్రకటించింది. తద్వారా దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ రియల్ ఎస్టేట్ కంపెనీగా తమ స్థానాన్ని పదిలం చేసుకోవాలని రాంకీ భావిస్తోంది.