ఘనంగా జరిగిన చికాగో ఆంధ్ర సంఘం సాంస్కృతిక దినోత్సవ వేడుకలు
చికాగో ఆంధ్ర సంఘం (CAA) సాంస్కృతిక దినోత్సవ వేడుకలు నవంబర్ 2వ తేదీన ఓస్వెగొ ఈస్ట్ హైస్కూల్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి నాయకత్వంలో, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి ఆధ్వర్యంలో, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి గారి పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలలో 1000కి పైగా పాల్గొని ఆనందించారు.
హేమంత్ తలపనేని గారి ఆధ్వర్యంలో పద్మారావు అప్పలనేని, అనురాధ గంపాల, హరచంద్ గంపాల, శ్రీశైలేష్ మద్ది, మురళీ రెడ్డివారి, గిరిరావు కొత్తమాసు మరియు యువజన విభాగ సభ్యులు - లోహిత గంపాల, రితేష్ బొమ్మినేని, చిన్నారి సువిజ్ఞ వీర్ మున్నగు వారు సభ్యత్వ నమోదు, రెజిస్ట్రేషన్ నిర్వహిస్తు విచ్చేసిన వారందరినీ ఆప్యాయంగా స్వాగతించారు.
సంస్థ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ధర్మకర్తలు, వ్యవస్థాపకులు దీపప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రెండు భాగాలుగా నిర్వహించిన ఈ కార్యక్రమం తొలి భాగం గురుకిృప మ్యూజిక్ స్కూల్ వైదేహి చంద్రశేఖరన్ గారి విద్యార్థులు ఆలపించిన చక్కటి సాంప్రదాయ గీతాల ఆలాపనతో ఆరంభమైంది. ఉత్తేజపరచిన నృత్య రూపకాలు, ఉల్లాసంగా సాగిన నాట్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు పెద్దలు కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించారు.
సుమారు 80 మంది పిల్లలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్న పలు రీతుల జానపద నృత్యాల విశిష్ట కార్యక్రమం అచ్చమైన జానపద వాతావరణాన్ని ప్రతిబింబించేలా కూర్చిన చురుకైన నృత్యాలు వీనులవిందైన పాటలతో జానపద కళారూపాల విశిష్టతను కళ్ళకు కట్టినట్లు చూపించింది.
కూచిపూడి నృత్య గురువు జానకి ఆనందవల్లి నాయర్ గారి విద్యార్ధులు మనోహరంగా ప్రదర్శించిన థిల్లాన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.
టీం 2024 సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టెర్లు, అధ్యక్షులు, ధర్మకర్తలు అద్భుతమైన దీపావళి నృత్య ప్రదర్శన తో ప్రేక్షకులని అలరించారు.
అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి ఈ ఏడాది పొడవునా సంస్థ నిర్వహించిన అన్ని కార్యక్రమాలు విజయవంతమవడానికి ఆర్ధిక సహాయాన్ని అందించిన స్పాన్సర్లను ఒక్కొక్కరినీ విడివిడిగా వేదిక పై పరిచయంచేసి జ్ఞాపికలను అందించి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు.
ఈ కార్యక్రమానికి కాన్సలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( consular general of India), సోమనాధ్ ఘోష్ గారు విశిష్ట అతిధిగా విచ్చేసి అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఆనందం కలిగించిందని తెలుపుతూ వైద్య, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆంధ్ర ప్రవాసుల సేవలను కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలను జరుపుకోవడం ద్వారా పండుగలని, సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసి, ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయంటూ నిర్వాహకుల ప్రయత్నాన్ని అభినందించారు.
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నేపర్విల్ల్ సిటీ కౌన్సిల్ కు పోటీ చేస్తున్న మేఘనా బన్సాల్ ఈ కార్యక్రమానికి విచ్చేసి తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి మరియు వారి సతీమణి రాధిక గరిమెళ్ళ గారిని 2023 లో వారు సంస్థ కు అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి సత్కరించారు.
తన అధ్యక్షతన టీం 2024 సాధించిన విజయాలను వివరించి, 2024 లో సేవలందించిన సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టెర్లను వారి కుటుంబాలను అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి వేదిక పైకి ఆహ్వనించి జ్ఞాపికలను అందచేసి కృతజ్ఞతలు తెలియజేసారు.
2025 సంవత్సరానికి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న శ్రీకృష్ణ మతుకుమల్లి టీం 2025 ను వేదికపై ప్రేక్షకులకు పరిచయం చేసి 2026 సంవత్సరానికి అధ్యక్షురాలిగా తమిశ్ర కొంచాడ ఎంపికను ప్రకటించారు. సంస్థ యొక్క సేవావిభాగమైన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను, మును ముందు చేపడుతున్న ప్రాజెక్ట్ లను సవితా మునగ మరియు అనురాధ గంపాల వివరించారు.
సంస్థ స్పాన్సర్లు Fixity Group of Companies, వినయ్ వెలివెల గారు, Olive Mithai Shop, హైదరాబాద్ వారి సహకారంతో దీపావళి శుభాకాంక్షలతో నభ్యులందరికీ మిఠాయిలు అందజేసారు.
నరేశ్ చింతమాని ఆధ్వర్యంలో “Bowl-O-Biryani’ వారు రుచికరంగా తయారుచేసిన “ఆంధ్రా విందు భోజనాన్ని” మురళి రెడ్డివారి, గిరిరావు కొత్తమాసు, శ్రీనివాస్ పద్యాల, సురేష్ ఐనపూడి, బోస్ కొత్తపల్లి, మల్లిక్ గోలి, సతీష్ పసుపులేటి, నరసింహా రెడ్డి ఒగ్గు, సునీల్ ఆకులూరు, రాజు బొజ్జ, కళ్యాణ్ కొండిశెట్టి, సుబ్బు బెస్త, చందు గంపాల, అనురాధ గంపాల, శ్రీకాంత్ ప్రెక్కి, మార్కండేయులు కందుల, రామకృష్ణ దోనూరి, సునీల్ చిట్లూరి, సాయిప్రకాశ్ ఆళ్ళ, నరేంద్ర నూకల, శాంతి చిట్లూరి, వీరబ్రహ్మం ఆదిమూలం, రాఘవ జాట్ల, ఆశ్రిత్ కొత్తపల్లి, శివ జాట్ల, లక్ష్మణ్ రెడ్డిశెట్టి, లక్ష్మణ్ చల్లా, అనిల్ మానేపల్లి, రామారావు కొత్తమాసు, మెహెర్ కటకం, శ్రీను అర్వపల్లి, సురేష్ గ్రంధి, శ్రీశైలేష్ మద్ది, విజయ్ దారా, శ్రీనివాస్ రాచపల్లి మరియు యువజన విభాగ వాలంటీర్లు ఎంతోమంది కొసరికొసరి వడ్డించారు.
కాస్మోస్ డిజిటల్ (Cosmos Digital ) సూర్య దాట్ల, అరుణ దాట్ల ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ సేవలనందించారు.
సంస్థ స్పాన్సర్ అకేషన్స్ బై కృష్ణ (Occasions by Krishna) కృష్ణ జాస్తి , తమిశ్ర కొంచాడ నిర్వహణలో శ్రీవాసవి టెంకుమళ్ళ, ప్రియ మతుకుమల్లి, నరసింహారావు వీరపనేని, రామారావు కొత్తమాసు, సుజాత అప్పలనేని, పావని కొత్తపల్లి, సమత పెద్దమారు, శైలజ సప్ప, అనూష బెస్త, మాధవ్, శ్రీనివాస్ సుబుద్ధి, బోస్ కొత్తపల్లి, శ్రీ కృష్ణ మతుకుమల్లి, పద్మారావు అప్పలనేని, మాలతి దామరాజు, జై అనికేత్ మేడబోయిన, విశృత్ చింతపల్లి, రితేష్ బొమ్మినేని,శ్వేత కొత్తపల్లి, కళ్యాణ్ కొత్తపల్లి, ఆశ్రిత్ కొత్తపల్లి సహకారాలతో అలంకరణలు జిగేలు మన్నాయి. రంగురంగుల దీపాల అలంకరణలతో ప్రాంగణం, ఫోటో బూత్ ఆహ్లాదకరముగా దసరా, దీపావళి శోభతో నిండినవి.
ఈ తొలి భాగాన్ని సాంస్కృతిక విభాగ డైరెక్టర్లు శైలజ సప్ప, శ్రీస్మిత నండూరి, అనూష బెస్త సమన్వయించగా, ప్రియ మతుకుమల్లి, ఆద్య బెస్త, శ్వేతిక బొజ్జ సహకరాన్నందించారు. శ్రీనివాస్ పద్యాల ఆడియో నిర్వహణ వ్యవహరించారు. సిరిప్రియ బచ్చు, రీతిక భోగాది, శ్రియ కొంచాడ, కావ్య శ్రీ చల్లా ఎంతో జనరంజకంగా, వ్యాఖ్యానాన్ని అందించారు.
వేదిక ప్రాంగణంలో గృహాలంకరణ వస్తువులు, దుస్తులు, నగలు కొనుగోలుకు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ వద్ద మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడిటోరియం ప్రవేశద్వార పరిసరాలు స్టాల్స్ తో జిగేలు మనగా కొనుగోలుకై మహిళలతో స్టాల్స్ కిటకిటలాడాయి.
అధ్యక్షులు శ్వేత కొత్తపల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు, ఉపాధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లి, కోశాధికారి పద్మారావు అప్పలనేని, కార్యదర్శి గిరిరావు కొత్తమాసు వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
Neelam beautiful Ideas మరియు లింగం ఆభరణం వారు రాఫిల్ విజేతలకు బహుమతులు అందజేశారు.
మలి భాగంలో భోజనానంతర కార్యక్రమాన్ని “రాగిన్” తెలుగు బాండ్ (Raagin - First Telugu Band in USA) గాయనీగాయకులు మరియు వాద్య బృందం జనరంజకమైన పాటలను ఫ్యూజన్ సంగీతంతో జోడించి ప్రదర్శించి శ్రవణపేయమైన వీనులవిందు చేసి అలరించారు.
సంస్థ యొక్క ట్రస్టీలు శ్రీనివాస్ పెదమల్లు, సుజాత-పద్మారావు అప్పలనేని, డా. సంధ్య అప్పలనేని, రాఘవ-శివబాల జాట్ల, పవిత్ర కారుమూరి, మరియు పూర్వ అధ్యక్షులు గౌరీశంకర్ అద్దంకి, మాలతి దామరాజు, శ్రీ శైలేష్ మద్ది, కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాలా తమ సహకారాన్నందించారు.
వేడుకను విజయవంతం చేయడానికి సహకరించిన స్పాన్సర్ల ను, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సవిత మునగ, అనూష బెస్త, శైలజ సప్ప, శ్రీ స్మిత నండూరి, అన్వితా పంచాగ్నుల, లక్ష్మి నాగ్ సూరిభొట్ల, హేమంత్ తలపనేని, గీతిక మండల, తమిశ్ర కొంచాడ, మురళీ రెడ్డివారి, పద్మారావు అప్పలనేని, నరసింహరావు వీరపనేని, ప్రభాకర్ మల్లంపల్లి, గిరి రావు కొత్తమాసు, మనస్వి తూము, కావ్య శ్రీ చల్లా; ట్రస్టీలు మరియుఎంతో మంది వాలంటీర్లు, అందరికీ సంఘ అధ్యక్షురాలు శ్వేత కొత్తపల్లి ధన్యవాదాలు తెలియచేసారు.
సంస్థ కార్యదర్శి గిరి రావు కొత్తమాసు గారు, ఎంతో ఓపికగా కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించి వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథి మహాశయులకూ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి శ్రమించిన సంస్థ ప్రతినిధులు, కార్యక్రమ పోషకులకు మరియు ఎంతో మంది వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేసి, వందన సమర్పణ చేసారు.
అమెరికా, భారత దేశాల జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం సుసంపన్నమయినది.