ASBL Koncept Ambience
facebook whatsapp X

ఘనంగా డిటిఎ దీపావళి వేడుకలు

ఘనంగా డిటిఎ దీపావళి వేడుకలు

డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ (డిటిఎ) ఆధ్వర్యంలో నవంబర్‌ 2వ తేదీన కాంటన్‌ హిందూ టెంపుల్‌ లో జరిగిన దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 700మందికిపైగా అతిధులు, ఆహ్వానితులు ఈ వేడుకలకు తరలివచ్చారు. మన ఉజ్వల సంస్కృతి మరియు ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు సాగాయని డిటిఎ ప్రెసిడెంట్‌ కిరణ్‌ దుగ్గిరాల తెలిపారు ఉదయం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో 250కి పైగా పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. సాయంత్రం, రఘు కుంచే మరియు అంజనా సోమ్యా లైవ్‌ మ్యూజిక్‌ ప్రదర్శనతో వచ్చినవారంతా పరవశించిపోయారు. చక్రవాకం ఫేమ్‌ ఇంద్ర నీల్‌ ప్రత్యేక ప్రైమ్‌ టైమ్‌ షో కూడా అందరిలోనూ ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది. 

30 ఏళ్లకు పైగా డిటిఎలో కీలకంగా ఉన్న వెంకట్‌ ఏక్క గారికి ప్రతిష్టాత్మకమైన వడ్లమూడి వెంకట రత్నం అవార్డును ప్రదానం చేశారు. సన్నీ రెడ్డి గారికి డిటిఎ కమ్యూనిటీ లీడర్‌ షిప్‌ అవార్డును, జ్ఞానేశ్వర గుబ్బల గారికి డిటిఎ అవుట్‌ స్టాండింగ్ కమ్యూనిటీ సర్వీస్‌ అవార్డును కూడా ప్రదానం చేశారు. 

ఈ వేడుకలకు మేరిలాండ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అరుణ కాట్రగడ్డ మిల్లర్‌ హాజరై, ప్రవాసులు భవిష్యత్‌ నిర్మాణంలో ఎలా కీలకంగా వ్యవహరించగలరో వివరిస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. 

డిటిఎ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులు సుబ్రతా గడ్డం, రాజా తొట్టెంపూడి, కుసుమ కళ్యాణి అక్కిరెడ్డి, అర్చన చవళ్ల, మంజీరా పాలడుగు, ప్రణీత్‌ వెళ్లొరె, స్వప్న ఎల్లెందుల, తేజ్‌ కైలాష్‌, సంజీవ్‌ పెడ్డి తదితరులు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు.  సలహా కమిటీ సభ్యులు జో పెద్దిబోయిన, నీలిమా మన్నె, సుధీర్‌ బాచు మార్గదర్శకత్వం చేయడంతోపాటు, మద్దతు అందించినందుకు వారికి  హృదయపూర్వక ధన్యవాదాలను ప్రెసిడెంట్‌ కిరణ్‌ దుగ్గిరాల తెలియజేశారు. అలాగే తానా నాయకులు సునీల్‌ పంత్రా, ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు, శ్రీనివాస గోగినేని తదితర నాయకులు మరియు ఎస్‌వి బోర్డు ఛైర్మన్‌ శ్రీనివాస్‌ కొనేరు, ఇతర విశిష్ట అతిథులు వేడుకల్లో పాల్గొని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :