రివ్యూ : ఓ నిరుద్యోగ యువకుడి ప్రయత్నం 'ఈ సారైనా'
నిర్మాణ సంస్థ : రీడింగ్ ఫిలిమ్స్,
నటీనటులు: విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్ తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ : గిరి, సంగీతం : తేజ్
పాటలు : గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
ఆర్ట్ డైరెక్టర్: దండు సందీప్ కుమార్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
నిర్మాత, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, ఎడిటర్, దర్శకత్వం: విప్లవ్
విడుదల తేదీ : 08.11.2024
నిడివి : 2ఘంటల 16 నిముషాలు
విప్లవ్, అశ్విని జంటగా తెరకెక్కిన సినిమా ‘ఈ సారైనా’. ఈ సినిమాలో విప్లవ్ హీరోగా నటిస్తూనే దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్ గా తెరకెక్కించాడు. ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు, సత్తన్న, అశోక్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సారైనా సినిమా నిన్న నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందొ సమీక్షలో చూద్దాం.
కథ:
చిన్నప్పటినుంచే రాజు(విప్లవ్) శిరీష(అశ్విని)ను ప్రేమిస్తూ ఉంటాడు. పెద్దయ్యాక శిరీష గవర్నమెంట్ టీచర్ గా జాబ్ తెచ్చుకుంటుంది. విప్లవ్ మాత్రం ఎన్నిసార్లు ట్రై చేసినా ఫెయిల్ అవుతూ ఉంటాడు. విప్లవ్ కి నమ్మకం పోయినా అతని ఫ్రెండ్, అశ్విని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. జాబ్ తెచ్చుకోవట్లేదని ఊళ్ళోవాళ్ళంతా ఈసారైనా గవర్నమెంట్ జాబ్ వస్తుందా అని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇక అశ్విని తండ్రి(ప్రదీప్ రాపర్తి) గవర్నమెంట్ జాబ్ వస్తేనే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని కండిషన్ పెడతాడు. దీంతో రాజు గవర్నమెంట్ జాబ్ కొడతాడా? ఇంతకూ రాజు – శిరీషల పెళ్లి జరిగిందా? లేదా... తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
నటీనటుల హావభావాలు :
పల్లెటూరి యువకుడిలా, గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలలో విప్లవ్ బాగా నటించాడు. ఓ పక్క దర్శకత్వం చేస్తూనే మరో పక్క తన నటనతో మెప్పించాడు. శిరీష పాత్రలో అశ్విని అయితే హీరోయిన్ గా కాకుండా మన ఇంటి పక్క అమ్మాయిలా సింపుల్ గా కనిపించి అలరించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో చేసిన ప్రదీప్ రాపర్తి మాత్రం తన నటనతో అదరగొట్టేసారు. మహబూబ్ బాషా అక్కడక్కడా నవ్వించాడు. చైల్డ్ ఆర్టిస్టులు కార్తికేయ, నీతూ క్యూట్ గా నటించి మెప్పించారు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. పల్లెటూరి లొకేషన్స్ ని బాగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫీల్ గుడ్ అనిపిస్తుంది. పాటలు వినడానికి బాగున్నాయి. ఇక ఒక మంచి లవ్ స్టోరీకి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని ఓ మంచి జర్నీ జత చేసిన కథను సింపుల్ కథనంతో దర్శకుడిగా, హీరోగా, ఎడిటర్ గా అన్ని భాద్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహించాడు విప్లవ్. మరో పక్క విప్లవ్, సంకీర్త్ చిన్న సినిమా అయినా ఎక్కడా తగ్గకుండా బెటర్ అవుట్ పుట్ ఇచ్చి నిర్మాతలుగా సక్సెస్ అయ్యారు.
విశ్లేషణ:
మొత్తంగా ‘ఈ సారైనా’ సినిమా నవ్విస్తూనే మంచి ప్రేమ కథతో గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలనే ప్రేరణతో ఫీల్ గుడ్ గా చూపించారు. సరదాగా సాగే సినిమా ఎక్కడా బోర్ లేకుండా ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తుంది. చిన్న సినిమా కదా అనేది పక్కనపెట్టి ఓ సారి చూస్తే మీకే అర్ధమౌతుంది గుడ్ ఆర్ బాడ్ అనేది.