ASBL Koncept Ambience
facebook whatsapp X

డల్లాస్‌లో ఘనంగా భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం

డల్లాస్‌లో ఘనంగా భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవం

అమెరికా దేశంలోనే అతిపెద్దదైన ఇర్వింగ్‌ మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సస్‌ కార్యదర్శి రావు కల్వల అతిథులకు స్వాగతం పలికారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్‌ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్‌ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్‌ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్య్ర సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్య్రం కోసం త్యాగంచేసిన మహనీయులను స్మరించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ టెక్సాస్‌ బోర్డ్‌ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్‌ రావు, జస్టిన్‌ వర్ఘీస్‌, జగజిత్‌ లు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు   సత్యన్‌ కళ్యాణ్‌ దుర్గ్‌, శాంటే చారి, లెనిన్‌ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్‌ ఫులాని తదితరులు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ‘‘జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి’’ గీతాన్ని లెనిన్‌ వేముల ఆలపించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :