ASBL Koncept Ambience
facebook whatsapp X

మహిళల కోసం ఇండిగో.. ప్రత్యేక ఫీచర్‌

మహిళల కోసం ఇండిగో..  ప్రత్యేక ఫీచర్‌

మహిళలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. విమానంలో మహిళలు ఎక్కడెక్కడ సీట్లు బుక్‌ చేసుకున్నారో తెలియజేసేలా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇకపై మహిళలు వెబ్‌ చెక్‌`ఇన్‌ సమయంలో ఇతర మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సీట్లు ఏంటో చూడొచ్చు. వాటిని బట్టి తమ సీట్లను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్‌తో వెబ్‌ చెక్‌`ఇన్‌ సమయంలో మాత్రమే మహిళా ప్రయాణికులు బుక్‌ చేసుకున్న సీట్లను చూడొచ్చు. ఒంటరిగా ప్రయాణించే మహిళలతో పాటు ఫ్యామిలీ బుక్సింగ్స్‌కూ కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతానికి పైలట్‌ మోడ్‌లో దీన్ని అందుబాటులోకి తెచ్చాం. ఈ ఆప్షన్‌ తీసుకురావడానికి ముందు మార్కెట్‌ రీసెర్చ్‌ చేశాం. మహిళలకు సౌకర్యవంతమైన, భద్రమైన ప్రయాణ అనుభవాన్ని అందించడమే మా లక్ష్యం అని ఇండిగో తమ ప్రకటనలో వెల్లడించింది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :