ASBL Koncept Ambience
facebook whatsapp X

డల్లాస్‌ లో రాహుల్‌ కు ఘన స్వాగతం

డల్లాస్‌ లో రాహుల్‌ కు ఘన స్వాగతం

అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌ వచ్చిన కాంగ్రెస్‌ అధి నాయకుడు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ఎన్నారైలు ఘనంగా స్వాగతం పలికారు. ఎయిర్‌ పోర్టులో ఆయనకు ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యులు ఘన స్వాగతం పలికారు.

‘‘డాలస్‌ లో ఇండియన్స్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సభ్యుల నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. నా పర్యటనలో అమెరికా, భారత్‌ మధ్య బంధం మరింత బలపడేందుకు కృషి చేస్తాను. అందుకోసం అవసరమైన చర్చల్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని ఫేస్‌ బుక్‌ లో రాహుల్‌ పోస్టు పెట్టారు. 

కాగా, లోక్‌ సభ ఎన్నికల తర్వాత తొలిసారి రాహుల్‌ అమెరికాకు వెళ్లారు. తన పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌ డీసీలో కూడా ఆయన పర్యటిస్తారు. రాహుల్‌ పర్యటనలో భాగంగా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ శామ్‌ పిట్రోడా తెలిపారు.

‘‘ఇది రాహుల్‌ అధికారిక పర్యటన కాదు. కానీ వివిధ వర్గాలతో ఆయన సమావేశమవుతారు. విద్యావేత్తలు, జర్నలిస్టులు, స్టూడెంట్లు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణులతో ఇంటరాక్ట్‌ అవుతారు. వాషింగ్టన్‌ డీసీలోని నేషనల్‌ ప్రెస్‌ క్లబ్‌ లో మీడియాతో, జార్జ్‌ టౌన్‌ యూనివర్సిటీలో స్టూడెంట్లతో ఇంటరాక్షన్‌ ఉంటుంది’’ అని చెప్పారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :