ASBL Koncept Ambience
facebook whatsapp X

జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్-ఎన్సీ కూటమిదే...

జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్-ఎన్సీ కూటమిదే...

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ -ఎన్‌సీ కూటమి.. జయభేరీ మోగించింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత కశ్మీర్ లో ఇండియా కూటమి గెలుపు సాధించింది. జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్ 46. ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి 49 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 29 స్థానాల్లో గెలుపు, ఆధిక్యంలో ఉంది. ఇక పీడీపీ 3, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యం, గెలుపులో ఉన్నారు. ఇక కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి మెజార్టీ మార్కుకు అవసరం అయిన స్థానాలు రావడంతో అధికార ఏర్పాటుకు సన్నద్ధమైంది.

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్-ఎన్‌సీ కూటమికి అనుకూలంగా వచ్చిన వేళ.. ఆ రాష్ట్ర సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తండ్రి ఫరూక్‌ అబ్దుల్లా స్పష్టం చేశారు. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌ ప్రజలు తమ తీర్పును తెలియజేశారని పేర్కొన్న ఫరూక్ అబ్దుల్లా.. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని 2019లో రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఆగస్టు 5వ తేదీన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించడం లేదని జమ్మూ కాశ్మీర్ జనం స్పష్టంగా తెలియజేశారని చెప్పారు.

ఇక జమ్మూ కాశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లానే అని తేల్చి చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కాంగ్రెస్-ఎన్‌సీ కూటమి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. 2014 ఎన్నికల్లో 87 సీట్లకు గానూ బీజేపీ 25 స్థానాల్లో విజయం సాధించింది. పీడీపీతో పొత్తు పెట్టుకుని.. ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసింది. నియోజకవర్గాల పునర్విభజనతో ఆ సీట్ల సంఖ్య 90కి చేరింది. గవర్నర్ కోటాలో 5 సీట్లున్నాయి. 2019లో రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఈ నేపథ్యంలో జరిగిన తొలి ఎన్నికల్లో పీడీపీ మూ స్థానాలు దక్కించుకుంది. ఆప్ ఓ స్థానంలో గెలిచింది. ఏడుగురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :