ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : తెలంగాణ ప్రజల మనిషి 'జితేందర్ రెడ్డి' బయోపిక్    

రివ్యూ : తెలంగాణ ప్రజల మనిషి 'జితేందర్ రెడ్డి' బయోపిక్    

నిర్మాణ సంస్థ : ముదుగంటి క్రియేషన్స్,
నటీనటులు: రాకేష్ వర్రే,  వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. తదితరులు నటించారు.
సినిమాటోగ్రఫీ : వీ ఎస్ జ్ఞాన శేఖర్, సంగీతం : గోపి సుందర్
ఎడిటర్ : రామకృష్ణ అర్రం, సహ నిర్మాత: ఉమ రవీందర్
నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విరించి వర్మ
విడుదల తేదీ : 08.11.2024
నిడివి : 2 ఘంటల 36 నిముషాలు

ప్రముఖ నటుడు రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’(జితేందర్ రెడ్డి). ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ట్రైలర్ కి  మిలియన్ పైగా వ్యూస్ రావడం విశేషం. అంతే కాకుండా, సినిమా టీజర్, గ్లిమ్ప్స్, రెండు పాటలు ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకున్నాయి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం. సినిమా విడుదలకు ముందు ఒక వర్గం ప్రజలు సినిమాను ఆపేస్తాము అని హెచ్చరికలు చేయడం ఓ సంచలనం అయ్యింది. మొత్తానికి నిన్న శుక్రవారం థియేటర్లలో విడుదల ఐయ్యింది మరి సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం.  

కథ: 

1980 కాలంలో జగిత్యాలలో జరిగిన ఓ సంఘటనతో జితేందర్ రెడ్డి (రాకేశ్ వర్రే)(రాకేష్ వర్రే) ప్రజల కోసం బతకాలనే కోరికతో పెరుగుతాడు. తనకు స్పూర్తిని రగిలించిన జాతీయ భావాలున్న గొపన్న (సుబ్బరాజు) (సుబ్బా రాజు), రామన్నను ఆదర్శంగా తీసుకొని వామపక్ష భావజాలం ఉన్న వారితో పోరాటం చేస్తుంటాడు. కాలేజీలో లెఫ్ ఆధిపత్యానికి గండి కొడుతాడు. అలాగే నక్సలైట్ ఉద్యమానికి ఎదురుగా నిలబడుతాడు. ఇలా అతడు ప్రజలతో మమేకం అవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ లభిస్తుంది. చిన్నతనంలో జితేందర్ రెడ్డి ఆలోచన విధానాన్ని మార్చి వేసిన సంఘటన ఏమిటి? గోపన్న, రామన్న జీవితాలను ఎలా స్పూర్తిగా తీసుకొన్నాడు? కాలేజీలో లెఫ్ట్ పార్టీ స్టూడెంట్ యూనియన్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? నక్సలైట్లను జగిత్యాల గడ్డపై అడుగుపెట్టకుండా ఎలా అడ్డుకొన్నాడు? స్థానిక ఎమ్మెల్యేను ఎలా ఎదిరించాడు? జితేందర్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఎలా సాగింది? ఎమ్మెల్యే టికెట్ లభించిన తర్వాత ఎలాంటి ఎదురుదెబ్బలు తగిలాయి? నక్సలైట్లపై జితేందర్ రెడ్డి ఎలాంటి ప్రతీకారం తీర్చుకొన్నారు లేదా నక్సలైట్లే ఆయనపై ఎలాంటి తిరుగుబాటు చేశారు? జితేందర్ రెడ్డి జీవితానికి ముగింపు ఏమిటనే ప్రశ్నలకు సమాధానాలు తెరపైన చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు : 

రాకేశ్ వర్రే తన నటనతో సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో జితేందర్ రెడ్డిగా ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోయాడనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. ఇక గోపన్నగా సుబ్బరాజు,గట్టయ్యగా రవి ప్రకాశ్ సినిమాకు హైలెట్‌గా నిలిచారు. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

కథగా విస్తరించే విషయంలో దర్శకుడు విరంచి వర్మ పూర్తిగా పట్టు సాధించలేడనే విషయం కనిపిస్తుంది. కాకపోతే కొన్ని సీన్లను చాలా ఎమోషనల్‌గా రాసుకోవడమే కాకుండా తెరపైన భావోద్వేగాన్ని పండించడంలో సఫలమయ్యారు. గోపన్న, రామన్న హత్య ఎపిసోడ్, అలాగే గట్టయ్య క్యారెక్టర్ ద్వారా కథను చెప్పడం బాగుంది.అయితే జితేందర్ రెడ్డి ఫస్టాఫ్ క్యారెక్టర్ల ఎంట్రడక్షన్, అలాగే కథను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే ఎక్కువ సమయం తీసుకోవడంతో కొంత నింపాదిగా సాగినట్టు అనిపిస్తుంది. అలాంటి లోపాన్ని సెకండాఫ్‌లో దర్శకుడు విరించి వర్మ సవరించుకొని.. మంచి యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆకట్టుకొన్నాడని చెప్పవచ్చు. 80, 90వ దశకంలోని వాతావరణాన్ని తెరమీద చూపించే విషయంలో దర్శకుడు ఫర్యాలేదనిపిస్తారు.మ్యూజిక్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫి మూవీకి కీలకంగా మారాయి. 80వ దశకం నాటి వాతావరణాన్ని తెరమీదకు తీసుకు రావడంలో ఆర్ట్ విభాగం పనితీరు బాగుంది. క్యాస్టూమ్, ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొన్నారనే విషయం చక్కగా ఎస్టాబ్లిష్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా ఉండటమే కాకుండా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ముదుగంటి రవీందర్ రెడ్డి, ఉమ రవీందర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

విశ్లేషణ:

ఆరెస్సెస్ భావజాలంతో పెరిగిన జితేందర్ రెడ్డి నక్సలైట్లను ఎదురించి రాజకీయ నేతగా ఎలా మారరనే కథతో తెరకెక్కిన చిత్రం జితేందర్ రెడ్డి. ప్రజలకు సేవల చేయాలనే నిర్ణయంతో తన జీవితాన్ని మలిచుకొన్న తీరు ఈ తరం వారికి స్పూర్తిని కలిగించేలా ఉంది. బస్సులు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసమే ఉద్యమమా? అనే డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి. అయితే పూర్తిగా జాతీయవాదులకు అనుకూలంగా ఉండటం వల్ల లెఫ్ట్ సానుభూతిపరులకు నచ్చే అవకాశం ఉండదు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేలా సినిమాను రూపొందించాల్సిందనే ఫీలింగ్ కలుగుతుంది. కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతాన్ని నక్సలైట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న రోజుల్లో జితేందర్ రెడ్డి ప్రాణాలకు తెగించాడనే పాయింట్‌ను  క్లైమాక్స్‌లో యాక్షన్ ఎపిసోడ్ అదరగొట్టేలా తీశాడు. ఆ సమయంలో చత్తీస్ గఢ్ అనేదే లేదు. ఇలాంటి చిన్న చిన్న తప్పులను సరిచూసుకొంటే బాగుండేదనిపిస్తుంది. కానీ రాకేశ్ వర్రే నటన కారణంగా ఈ సినిమా ఫీల్ గుడ్ మూవీగా మారిందని చెప్పవచ్చు. బయోపిక్స్ ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye Radha Spaces
Tags :