ASBL Koncept Ambience
facebook whatsapp X

బైడన్ బాటలో కమలా..? డెమొక్రాటిక్ అభ్యర్థులు మరీ సాఫ్టా...?

బైడన్ బాటలో కమలా..? డెమొక్రాటిక్ అభ్యర్థులు మరీ సాఫ్టా...?

డెమొక్రాటిక్ అభ్యర్థులుగా ఉంటున్న వ్యక్తులు.. మరీ సాఫ్ట్ గా ఉన్నారా..? ప్రస్తుత అధ్యక్షుడు బైడన్ అయినా.. వైస్ ప్రెసిడెంట్ కమలహారిస్ అయినా.. పార్టీ విధానాలకు బంధీలుగానే ఉంటారా..? వారు అవసరమైన చోట్ల తమ విధానాలను అవలంభించేలా ... నిర్ణయాలు తీసుకోగలుగుతారా..? వాల్ స్ట్రీట్ జర్నల్ ఎడిటోరియల్ బోర్డు కీలక వ్యాఖ్యలు ఇవే అనుమానాలు కలిగిస్తున్నాయి. హారిస్ డెమొక్రాటిక్ పార్టీకి బంధీగా ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ఆమె మార్చలేరని అనుమానం వ్యక్తం చేసింది. తటస్థ ఓటర్లు ఆమెను డమ్మీగా భావిస్తే... ట్రంప్ గెలిచే అవకాశాలుంటాయని హెచ్చరించింది కూాడా.

మెజార్టీ ఓటర్లు ట్రంప్ నకు ఓట్లేయరని డెమొక్రాట్లు పందెం కాస్తున్నారని తెలిపింది వాల్ స్ట్రీట్ జర్నల్ . కానీ ఆమె తమ పార్టీ విధానాలను మార్చలేరని.. ప్రజలు అనుకుంటే ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంటుందని హెచ్చరించింది.ఇటీవలి హారిస్ ప్రచార కార్యక్రమాలు చూస్తుంటే....ఆమె కూడా బైడన్ బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోందంది . ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో ఇతరులపై ఆధారపడినట్లు కనిపిస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది . ప్రచారకార్యక్రమాల్లో హారిస్ జోరు తగ్గుతోందని మరో పత్రిక ఫైనాన్షియల్ డైలీ సైతం అభిప్రాయపడింది.

కీలక రాష్ట్రాల్లో ట్రంప్ కు మద్దతు పెరుగుతుండడంపై.. డెమొక్రాట్లలో ఆందోళన పెరుగుతోందని తెలిపింది డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా నామినేట్ అయిన తర్వాత హారిస్ ప్రచారం ప్రారంభించారు. పార్టీలో సీనియర్ల మద్దతుతో ముందుకు దూసుకుపోతున్నారు. అంతేకాదు.. హారిస్ అభ్యర్థిత్వానికి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోందని సర్వేలు చెబుతున్నాయి. ట్రంప్ తో జరిగిన డిబేట్ లో సైతం హారిస్ పైచేయి సాధించారని.. సోషల్ మీడియా, మీడియా కథనాలు తెలిపాయి. అయితే.. పోరు మాత్రం హోరాహోరీ తప్పదని చెబుతున్నాయి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :