ASBL Koncept Ambience
facebook whatsapp X

నారా - నల్లారి భేటీ వెనక...? చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేశారా..?

నారా - నల్లారి భేటీ వెనక...? చంద్రబాబు టార్గెట్ ఫిక్స్ చేశారా..?

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి... టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అవ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి.. టీడీపీ అధ్యక్షుడు, ఎన్డీఏలో కీలక భాగస్వామ్య పార్టీలో ఉన్న చంద్రబాబుతో ఎందుకు భేటీ అయ్యారు. ఆయన భేటీ వెనక ఉన్న కారణాలేంటి..? కిరణ్... టీడీపీ వైపు చూస్తున్నారా...? లేక బీజేపీలో కీలక పదవి పొందేందుకు చంద్రబాబు మద్దతు కోరుతున్నారా..? అసలు కిరణ్ కుమార్ రెడ్డి లక్ష్యమేంటి..? చంద్రబాబు ... ఈ వ్యవహారాన్ని ఎలా చూస్తున్నారు...?

ముఖ్యంగా పుంగనూరు అడ్డాగా దశాబ్దాల కాలం నుంచి రాజకీయం చేస్తున్న పెద్దిరెడ్డి .. వైసీపీ హయాంలో చంద్రబాబును టార్గెట్ చేశారు. ? అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు కుప్పంలో చేయిపెట్టి రాజకీయంగా .. టీడీపీ చీఫ్ ను కెలికారు. ఇప్పుడు వైసీపీ పవర్ పోయింది. ఇక చంద్రబాబు ఊరుకుంటారా..? అంతే .. ఆపరేషన్ పుంగనూరు స్టార్టైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మిథున్ రెడ్డిపై పార్లమెంటరీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు అదే కుటుంబంపై రాజకీయంగా కక్ష తీర్చుకోవాలని భావిస్తున్నారని.. అందుకే చంద్రబాబును కలిశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డిని తొక్కేయాలని చంద్రబాబు భావిస్తున్నారా?పొలిటికల్ గా దెబ్బ తీయాలని గట్టి ఆలోచన చేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో పుంగనూరులో ఆ కుటుంబం గెలవకూడదని నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా పెద్దిరెడ్డి కి చెప్పాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం హైదరాబాదులో చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి గంట పాటు సమావేశమయ్యారు.చాలా లోతుగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యేగా కిరణ్ సోదరుడు ఉన్నారు.ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు . వచ్చే ఎన్నికల నాటికి పెద్దిరెడ్డి పేరు వినిపించకుండా చేయాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే కిరణ్ కుమార్ రెడ్డితో సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో చంద్రబాబు .. కిరణ్ కుమార్ రెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ఇప్పుడు కిరణ్ చంద్రబాబుని ఎందుకు కలిశారా? అన్నది ప్రశ్న. ప్రతిష్టాత్మకమైన టిటిడి చైర్మన్ పదవి కోసమని కూడా ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజ్యసభ పదవి అడిగినట్లు కూడా టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందే. అందుకే చంద్రబాబును కలిసి తన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చించారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :