ASBL NSL Infratech
facebook whatsapp X

రివ్యూ : యూట్యూబర్ ప్రయత్నం 'లారీ' - చాప్టర్ 1

రివ్యూ : యూట్యూబర్ ప్రయత్నం 'లారీ' - చాప్టర్ 1

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థ  : కింగ్ మేకర్ పిక్చర్స్
నటీనటులు : శ్రీకాంత్ రెడ్డి ఆసం, చంద్రశిఖా శ్రీవాస్, రాంకీ సింగ్ తదితరులు
ఎడిటర్, స్టంట్ మాస్టర్: శ్రీకాంత్ రెడ్డి ఆసం  
కెమెరా: తాడిపత్రి నాగార్జున, నిర్మాత: ఆసం వెంకట లక్ష్మి
దర్శకత్వం, నిర్మాత, హీరో, సంగీత దర్శకుడు,  
విడుదల తేదీ: 02.08.2024

సోషల్ మీడియా  వీడియోలతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న ప్ర‌ముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం  స్వయంగా తీసిన చిత్రం "లారీ - చాప్టర్ 1" . శ్రీకాంత్ రెడ్డి ఆసం తన తొలి చిత్రంలో హీరోగా, దర్శకత్వం వహిస్తూ, సంగీత దర్శకుడు, ఎడిటర్, స్టంట్ మాస్టర్‌గా కూడా పనిచేశారు. కింగ్ మేకర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆసం వెంకట లక్ష్మి నిర్మించిన ఈ చిత్రంలో చంద్రశిఖా హీరోయినగా నటించారు. రాకీ సింగ్ ముఖ్యపాత్రలో నటించారు.తెలుగు , తమిళ , కన్నడ ,హిందీ ,బెంగాళీ బాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇవాల్టీ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

చిత్తూరు దగ్గర రంగపట్నంలో నివసించే హర్షవర్ధన్ ఆలియ‌స్ హంటర్ (శ్రీకాంత్ రెడ్డి ఆసం) వీధి రౌడీగా జీవనం సాగిస్తుంటాడు. తన కుటుంబాన్ని పోషించడానికి చిన్న చిన్న గొడవల్లోకి వెళ‌తాడు. ఒక సందర్భంలో జైలు పాలై, తరువాత ఒక అమ్మాయిని ప్రేమించి, చివరికి మెకానిక్ షాప్ పెట్టి సాధారణ జీవితం ప్రారంభించాలని ప్రయత్నిస్తాడు. ఈలోగా ప్రతాప్ అనే మైనింగ్ అధిపతి ముఖ్యమంత్రి అవ్వాలని, ఇల్లీగల్ మైనింగ్ చేస్తాడు. అతను మైనింగ్‌లో కనుగొన్న యురేనియం అమ్మడానికి హర్షవర్ధన్ సహకారం తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. హర్షవర్ధన్ తన చెల్లి పెళ్లి కోసం, కుటుంబం పైస్థాయికి వెళ్ళడం కోసం ఈ పనికి ఒప్పుకుంటాడు. 3000 కోట్ల సరుకును ముంబైకి డెలివరీ చేయడం కోసం లారీ డ్రైవ్ చేస్తాడు. ఈ ప్రయాణంలో వివిధ రాష్ట్రాల విలన్లు లారీని ఆపడానికి ప్రయత్నిస్తారు. చివరికి హర్షవర్ధన్ యురేనియం డెలివరీ చేశాడా? అతని తండ్రి బతికి ఉన్నాడా? ఇతివృత్తంలో ఉన్న విలన్లు అతని వెంట ఎందుకు పడ్డారు? అనే ప్రశ్నలకు సమాధానం ఈ చిత్రంలో చూడాలి.  

నటీనటుల హావభావాలు :

ఈ సినిమాకు ప్రధాన బలం శ్రీకాంత్ రెడ్డి ఆసం. యూట్యూబ్ స్టార్‌గా తనకు సంపాదించిన అనుభవంతో ఈ సినిమాను మన ముందు నిలబెట్టడంలో విజయసాధించారు. నటించడంలో పాటు సినిమా నిర్మాణం చేయడంలో అనుభవం చూపించారు. దర్శకత్వం, నటన, సంగీతం, ఎడిటింగ్, స్టంట్లన్నీ తనే నిర్వహించి మల్టీటాలెంట్ చూపించారు. హీరోగా శ్రీకాంత్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బాగున్నాయి, ఫైట్స్ అద్భుతంగా చేశాడు. మొదటి చిత్రంతో తనలోని టాలెంట్‌ను నెక్ట్స్ లెవెల్‌లో చూపించారు. హీరోయిన్ చంద్రశిఖా క్యూట్‌గా కనిపించింది. రొమాన్స్ సీన్లలో యూత్‌ను ఆకట్టుకుంది. రాకీ సింగ్, చంద్రశిఖా శ్రీవాస్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాటోగ్రఫీ తాడిపత్రి నాగార్జున అందించిన విజువల్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. మ్యూజిక్ ట్రాక్ సినిమాను మరో మెట్టు ఎక్కించింది, లిరికల్ వీడియోస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.ఎడిటింగ్ వర్క్ పరవాలేదు. టెంప్లేట్ పాతగా అనిపించినా, కథలో కొత్తదనం ఉంది. స్క్రీన్‌ప్లే సరికొత్తగా ఉంది. ద‌ర్శ‌క‌త్వం కొత్తగా క‌నిపిస్తుంది. నెవ‌ర్ బిఫోర్ ఇన్ టాలీవుడ్ అనేలా ఉంది.

విశ్లేషణ:

శ్రీకాంత్ రెడ్డి ఆసం తాను అనుకున్న కథను స్క్రీన్‌పై ప‌ర్‌ఫెక్టుగా ప్ర‌జెంట్ చేయడంలో స‌క్సెస్ అయ్యాడు. కోట్లాది ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న ఈ యూట్యూబర్, తొలి సినిమా అయినప్పటికీ ప్రతి పార్టులో ఎంతో పరిణతి, అనుభవం చూపించాడు. "హంటర్‌తో ఆట.. పగులుతుంది నీ చాట", "నీ వెనుక ఎవరు ఉన్నది ముఖ్యం కాదు - నీ ముందు ఎవరు ఉన్నది ముఖ్యం" వంటి డైలాగులు థియేటర్‌లో ఈలల పెట్టించాయి. "లారీ - చాప్టర్ 1" యాక్షన్, డ్రామా, సస్పెన్స్‌తో నిండి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. లవ్, రొమాన్స్ సీన్లు యువతను తెగ ఆకట్టుకుంటాయి. అన్న‌-చెల్లెలు సెంటిమెంట్‌, తండ్రి-కొడుకు సెంటిమెంట్ సీన్లు అందరికీ నచ్చుతాయి. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబర్ నుండి సినిమా రంగానికి తన ప్రయాణం ఈ తరం వాళ్లకి స్ఫూర్తిదాయకం. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవం కలిగిస్తుంది. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :