ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆమె శరీరంపై హక్కు ... అమెకుగాక ఇంకెవరికి?

ఆమె శరీరంపై హక్కు ... అమెకుగాక ఇంకెవరికి?

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే కీలకాంశాల్లో అబార్షన్‌ హక్కు ఒకటి. అధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య గత నెల జరిగిన డిబేట్‌లో గర్భ విచ్చిత్తి అంశంపై ఇరువురు వాడీవేడిగా చర్చించారు. ఈ క్రమంలో ట్రంప్‌ సతీమని మెలానియా నుంచి కీలక స్పందన వచ్చింది. అబార్షన్‌ హక్కులపై అధికారం రాష్ట్రాలకే ఉండాలని ట్రంప్‌ వాదిస్తుండగా, మెలానియా మాత్రం అబార్షన్‌ హక్కును సమర్థించారు. ఆమె శరీరం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఆమెకు గాకుండా ఇంకెవరికో ఎందుకు ఉండాలి. అవాంఛిత గర్భానికి సంబంధించి ఒక మహిళ తీసుకునే నిర్ణయాన్ని పరిమితం చేయడం. అమె సొంత శరీరంపై నియంత్రణను నిరాకరించడం కిందికే వస్తుంది అని ఆమె తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :