ASBL Koncept Ambience
facebook whatsapp X

మోపిదేవి, మస్తాన్ రావు చేరికకు ముహూర్తం ఖరారు..!!

మోపిదేవి, మస్తాన్ రావు చేరికకు ముహూర్తం ఖరారు..!!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి (NDA Alliance) అధికారంలోకి వచ్చాక రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నుంచి పలువురు నేతలు బయటికొస్తున్నారు. అధికార కూటమిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. సహజంగా ఓడిపోయిన నేతలు రాజకీయ పునరావాసం కోసం అధికార పార్టీల్లో చేరడం సహజం. అయితే చేతిలో అధికారం ఉన్నా దాన్ని వదిలేసి రావడం చాలా అరుదైన సందర్భాల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు పార్టీకి, పదవులకు రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు.

వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్ రావు (Beeda Masthan Rao) తమ పదవులకు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆగస్టు 29న వీళ్లిద్దరూ రాజ్యసభ (Rajyasabha) ఛైర్మన్ ను కలిసి లేఖలు సమర్పించారు. వాళ్ల రాజీనామాలకు వెంటనే ఆమోదం కూడా లభించింది. ఇది పెద్ద సంచలనం సృష్టించింది. తమకు ఇంకా మూడు, నాలుగేళ్ల పదవీకాలం ఉన్నా వాటిని వదులుకుని బయటకు రావడంపై పెద్ద చర్చే జరిగింది. వీళ్లతో పాటు బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్. కృష్ణయ్య (R krishnaiah) కూడా కొంతకాలానికి రాజీనామా చేశారు.

మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాలు సమర్పించి 40 రోజులైంది. అయినా వాళ్లు ఏ పార్టీలో చేరతారనే దానిపై ఉత్కంఠ కొనసాగింది. మోపిదేవి వెంకటరమణ తాను రాజీనామా చేసిన రోజే టీడీపీలో (TDP) చేరబోతున్నట్టు ప్రకటించారు. దీంతో క్లారిటీ వచ్చింది. తనకు రాష్ట్రంలో ఉండడమే ఇష్టమని.. అందుకే ఎంపీ (MP) పదవికి రాజీనామా చేశానని చెప్పారు. అయితే నలభై రోజులవుతున్నా టీడీపీలో చేరకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. మరోవైపు బీద మస్తాన్ రావు మాత్రం తను ఏ పార్టీలో చేరేదీ ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. తనకు కేంద్రంలోనే ఉండాలని ఉందన్నారు.

అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తమ అనుచరులతో చర్చల అనంతరం ఇద్దరూ సైకిల్ ఎక్కాలని నిర్ణయించుకున్నారు. 9వ తేదీ బుధవారం చంద్రబాబు (Chandrababu Naidu) సమక్షంలో తెలుగుదేశంలో (Telugu Desam) చేరబోతున్నారు. మోపిదేవి వెంకటరమణను మండలికి (MLC) పంపే అవకాశం కనిపిస్తోంది. బీద మస్తాన్ రావు మాత్రం మళ్లీ రాజ్యసభకు (Rajyasabha MP) వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఖాళీ అయిన స్థానాల్లో కచ్చితంగా టీడీపీయే గెలిచే అవకాశం ఉంది కాట్టి బీద మస్తాన్ రావు స్థానాన్ని ఆయనతోనే భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీలు కూడా ముగ్గురు రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిన వాటిలో ఒకదాన్ని మోపిదేవికి కేటాయించే అవకాశాలున్నాయి. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :