ట్రంప్ విజయం పట్ల సతీష్ వేమన హర్షాతికేతం.. ప్రచార సమయంలో ప్రముఖ పాత్ర..
గత కొద్దీ నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల నిరీక్షణకు తెర దించుతూ .. డోనాల్డ్ ట్రంప్ అమెరికా సంయుక్త రాష్ట్రాల 47 వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.. ఎన్నో మలుపుల మధ్య గత కొద్దీ నెలలుగా హోరా హోరీ ప్రచారం సాగించి, భవిష్యత్ కార్యాచరణపై ఎన్నో డిబేట్ లలో పాల్గొని.. ప్రత్యారోపణలతో విరుచుకుపడి మొత్తంగా కోట్లాది మంది ప్రజామోదంతో ఘన విజయంతో ..కొత్త అధ్యక్షునిగా అవతరించారు.
ముఖ్యంగా ఈ సారి ట్రంప్ విజయం వెనక భారతీయ ప్రముఖుల కృషి గమనార్హం.. ఎక్కువ శాతం ప్రభావితం చేయగలిగిన సంఖ్యలో తెలుగు వారు అత్యధికంగా ఉన్న తూర్పు రాష్ట్రాలలో సతీష్ వేమన లాంటి వారు ట్రంప్ ప్రతినిధులతో కలిసి గత సంవత్సర కాలంనుండి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు..ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలంగా సమర్ధించారు..కొద్దీ నెలల క్రితం అమెరికా రాజధాని వాషింగ్టన్ వేదికగా నిర్వహించిన రిపబ్లికన్ కాకస్ కార్యక్రమాన్ని ట్రంప్ స్వయంగా మెచ్చుకోవటం.. ఫ్లోరిడా లో ట్రంప్ దివాళి విందుకు హాజరై తన అభిప్రాయాలు పంచుకోవటం ..ఇటీవల జరిగిన మాడిసన్ స్క్వేర్ ప్రచార సభల్లో.. ఇలా పలు కార్యక్రమాలలో..ట్రంప్ విజయానికి తన వంతు పాత్ర సమర్ధంగా పోషించారు.
భారత అమెరికా సంబంధాలు ఎప్పటిలాగానే సుహృద్భావ వాతావరణంలో పరస్పర గౌరవ సోదర భావంతో కొనసాగుతాయని.. ఇరు దేశాల అభివృద్ధి.. యువతకు ఉద్యోగ, ఉపాధికల్పన తమ ఆకాంక్ష అని సతీష్ వేమన ఒక ప్రకటనలో తెలిపారు.