ASBL Koncept Ambience
facebook whatsapp X

ఏడవ రోజున నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాత్విక నృత్య ప్రదర్శన 

ఏడవ రోజున నాద బ్రహ్మోత్సవాల్లో అలరించిన సాత్విక నృత్య ప్రదర్శన 

అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా  అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు తొమ్మిది  రోజుల పాటు  "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా 7 రోజు అక్టోబర్  9 వ తేదీన శ్రీ భాస్కర డాన్స్ అకాడెమి నుంచి డి.సాత్విక బృందం, గణపతి తాళం, చక్కనితల్లికి, సిరుతనవ్వులవాడు, ఇన్ని రాశులయునికి వంటి సంకీర్తనలకు కూర్చిన  నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ఈ కార్యక్రమానికి భారతీయం సంస్థ అధినేత జి.సత్యవాణి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. గౌరవ అతిథులుగా మహీంద్రా యూనివర్శిటీ ప్రొఫెసర్ డా.రాజారావు త్రిపురనేని మరియు ఈటీవి చీఫ్ ప్రొడ్యూసర్ మరియు రచయిత అజయ్ శాంతి విచ్చేశారు. గౌరవ, ముఖ్య అతిథులు పద్మశ్రీ డా.శోభారాజు చేస్తున్న నాదబ్రహ్మోత్సవ్ కార్యక్రమాలను, అన్నమాచార్య భావనా వాహిని సంస్థ చేస్తున్న సంకీర్తనా ప్రచారాన్ని కొనియాడారు. అనంతరం తీర్థప్రసాద వితరణతో ఈరోజు కార్యక్రమం ముగిసింది.

 


 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :