ASBL Koncept Ambience
facebook whatsapp X

త‌న‌కేం కండిష‌న్స్ లేవంటున్న శోభిత‌

త‌న‌కేం కండిష‌న్స్ లేవంటున్న శోభిత‌

త్వ‌ర‌లోనే శోభితా ధూళిపాళ(Sobhitha Dhulipala) అక్కినేని ఇంట్లోకి కోడ‌లిగా అడుగుపెట్ట‌నుంది. యువ సామ్రాట్ నాగ చైత‌న్య‌(Naga Chaitanya)తో ఇప్ప‌టికే శోభితా నిశ్చితార్థం అయిపోయింది. వీరి పెళ్లికి మంచి ముహూర్తాన్ని ఇరువురి కుటుంబీకులు చూస్తున్నారు. ఎప్పుడైనా అక్కినేని(Akkineni Family) ఇంట పెళ్లి బాజాలు మోగే ఛాన్సుంది. డిసెంబ‌ర్ లో పెళ్లి అని ఇప్ప‌టికే కొంద‌రు అంటున్నారు.

వ‌చ్చే ఏడాది చైతూ(Chaitu)-శోభిత పెళ్లి చేసుకోనున్నార‌ని మ‌రికొంద‌రంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శోభిత త‌న రిలేష‌న్‌షిప్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. త‌న రిలేష‌న్‌షిప్ లో ఎలాంటి కండిష‌న్స్ లేవ‌ని, ఒక మ‌నిషిని కేవ‌లం మూడు ప‌దాల‌లో వ‌ర్ణించ‌లేన‌ని ఆమె అభిప్రాయ‌ప‌డింది. రూల్స్ ను కూడా బ్రేక్ చేసిన వారిని తాను ఇష్ట‌ప‌డ‌తాన‌ని శోభిత వెల్ల‌డించింది.

ఇంత‌వ‌ర‌కు త‌న జీవితంలో ఎలాంటి డీల్ బ్రేక‌ర్లు లేర‌ని కూడా శోభిత తెలిపింది. దీంతో శోభిత ఎంతో ఓపెన్ మైండెడ్ అని, చైతూని ఎంతో అర్థం చేసుకున్నాకే అతడితో ప్రేమ‌లో ప‌డింద‌ని గెస్ చేస్తున్నారు. స‌మంత‌(Samantha)తో విడాకులు తీసుకున్న త‌ర్వాత చైతూ, శోభిత‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ముందు స్నేహితులుగా ప‌రిచ‌య‌మైన వీరు త‌ర్వాత ప్రేమికులుగా మారి త్వ‌ర‌లోనే భార్యాభ‌ర్త‌లు కాబోతున్నారు. కాగా శోభిత ప్ర‌స్తుతం ఏ సినిమాకు క‌మిట్‌మెంట్ ఇవ్వ‌లేదు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :