ASBL Koncept Ambience
facebook whatsapp X

తానా బిజినెస్‌ - ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కమిటీ చైైర్‌పర్సన్‌గా సుబ్బ యంత్ర

తానా బిజినెస్‌ - ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కమిటీ చైైర్‌పర్సన్‌గా సుబ్బ యంత్ర

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యకలాపాల నిమిత్తం తానా బిజినెస్‌ - ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కమిటీ చైైర్‌పర్సన్‌గా సుబ్బ యంత్రను నియమించింది. బే ఏరియాలో బిజినెస్‌ ఎంట్రప్రెన్యూరర్‌గా ఉన్న సుబ్బ యంత్ర ఎంబిఎ గోల్డ్‌ మెడలిస్ట్‌. జాస్పర్‌ టెక్నాలజీస్‌ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. మోహన్‌ స్పింటెక్స్‌ విజయవాడ కంపెనీకి ప్రమోటర్‌ డైరెక్టర్‌ అండ్‌ హెడ్‌ గ్లోబల్‌ సేల్స్‌ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. డాక్టర్‌ యంత్ర 25 సంవత్సరాలకు పైగా వ్యాపారరంగంలో విజయాల ట్రాక్‌ రికార్డ్‌తో అనుభవజ్ఞుడైన వ్యాపార నిర్వాహకునిగా పేరు గాంచారు. వ్యాపారంలో అనుభవజ్ఞుడైన ఫ్యాకల్టీ కూడా. రిటైల్‌, టెక్స్‌టైల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ మరియు ఐటీ సర్వీసెస్‌ వంటి విభిన్న పరిశ్రమలలో కంపెనీలను ప్రారంభించిన సీరియల్‌ వ్యవస్థాపకుడు. కమ్యూనికేషన్‌, నెట్‌వర్కింగ్‌ మరియు నెగోషియేషన్‌ నైపుణ్యాలు ఆయన ప్రధాన బలాలు. బే ఏరియాలో, భారతదేశంలో కూడా అనుబంధ ఫ్యాకల్టీగా ఎంబిఎ విద్యార్థులకు బోధన చేస్తున్నారు. పీహెచ్‌డీ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పట్టాను ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎంబిఎ (మార్కెటింగ్‌) లో మొదటి ర్యాంక్‌ సాధించి గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. బే ఏరియాలో ఆయన నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :