ASBL Koncept Ambience
facebook whatsapp X

థ‌గ్ లైఫ్ అప్డేట్ ఏంటి?

థ‌గ్ లైఫ్ అప్డేట్ ఏంటి?

విక్ర‌మ్(Vikram) సినిమా త‌ర్వాత క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan)ఫుల్ జోష్ లో ఉన్న విష‌యం తెలిసిందే. వ‌రుస సినిమాల‌తో అల‌రిస్తున్న క‌మ‌ల్ రీసెంట్ గా క‌ల్కి(kalki)లో సుప్రీమ్ యాస్కిన్ పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. త‌న పాత్ర క‌నిపించింది కాసేపే అయిన‌ప్ప‌టికీ త‌న గెట‌ప్, న‌ట‌న‌తో ఆడియ‌న్స్ ను భ‌య‌పెట్టాడు. ఇండియ‌న్2(Indian2) డిజాస్ట‌ర్ అయిన‌ప్ప‌టికీ అత‌ని న‌ట‌న మాత్రం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్, డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం(Mani ratnam) ద‌ర్శ‌క‌త్వంలో థ‌గ్ లైఫ్(Thug Life) అనే సినిమా చేస్తున్నాడు. పొన్నియ‌న్ సెల్వ‌న్(Ponniyan Selvan) త‌ర్వాత మ‌ణిర‌త్నం చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అంతేకాదు క‌మ‌ల్- మ‌ణి కాంబోలో 36 ఏళ్ల త‌ర్వాత సినిమా రానుండ‌టంతో థ‌గ్ లైఫ్ పై మంచి బ‌జ్ నెల‌కొంది.

వీరి కాంబోలో గ‌తంలో వ‌చ్చిన నాయ‌గ‌న్(nayagan) మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ‌గా ఇప్పుడు ఇన్నేళ్ల త‌ర్వాత వ‌స్తున్న థ‌గ్ లైఫ్ పై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి. పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో క‌మ‌ల్ మూడు భిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. జ‌న‌వ‌రిలో మొద‌లైన ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తైన‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుగుతున్నాయ‌ని, రీసెంట్ గానే క‌మ‌ల్ త‌న డబ్బింగ్ ను పూర్తి చేశాడ‌ని త్వ‌ర‌లోనే మేక‌ర్స్ రిలీజ్ డేట్ పై అధికారికంగా ప్ర‌క‌ట‌న ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :