తిరుమల శ్రీవారి లడ్డు కొత్త అప్డేట్.. సిట్ కమిటీ సభ్యుల నియామకం..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంగా అందరూ భావించే పరమ పవిత్రమైన లడ్డుకు వినియోగించే నేతిలో కల్తీ జరిగింది అంటూ సాగిన ఆరోపణ ఎటువంటి దుమారానికి దారితీసిందో అందరికీ తెలుసు. ఇక ఈ విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర కూటమి నేతలు ఎంతగా హైలైట్ చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తమపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వైసీపీ ఈ విషయాన్ని కోర్టు వరకు తీసుకువెళ్లిన విషయం తెలిసిందే.ఇక ఈ విషయంలో సుప్రీం కోర్ట్ అయిదుగురు సభ్యులతో విచారణ చేయడానికి ఆదేశించింది.
ఒక రెండు నెలల క్రితం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా ఉన్న శ్రీవారి లడ్డు పై సుమారు నెలన్నర తర్వాత మరొక అప్డేట్ తాజాగా వైరల్ అయింది. లేటెస్ట్ గా సిట్ సభ్యుల నియామకం జరగడంతో మరొకసారి శ్రీవారి లడ్డు టాపిక్ లైమ్ లైట్ లోకి వచ్చింది. సిట్ విచారణ కమిటీలో హైదరాబాద్ సిబిఐ జాయింట్ డైరెక్టర్ ఎస్వీ వీరేష్ ప్రభు, విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ మురళీ రంభ లను నియమించారు. అలాగే గతంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, విశాఖపట్నం రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి లకు సిట్ సభ్యులుగా స్థానం దక్కింది. ఇక ఇందులో ఫుడ్ సేఫ్టీ మెంబర్ పేరు ప్రకటించాల్సి ఉంది.
ఇక సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో త్వరలోనే సీట్ బృందం తన విచారణ చేయబోతుందని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ శ్రీవారి లడ్డు విషయంలో వచ్చిన ఆరోపణలపై విచారణ మొదలుపెట్టబోతుంది. ఇందుకోసం తిరుపతిలో ఓ ప్రత్యేకమైన ఆఫీసును కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ఈ విషయంలో వాస్తవాలు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారుతాయి అన్న విషయంలో డౌట్ లేదు. ఆరోపణ నిజమైతే కూటమికి ప్లస్ అవుతుంది.. అదే ఆరోపణ తప్పైతే జగన్ ప్రజల సానుభూతిని పొందే అవకాశం ఉంది. మరి ఇంతకీ సిట్ కమిటీ ఈ విషయంలో ఏం తెలుస్తారో చూడాలి..