ASBL Koncept Ambience
facebook whatsapp X

జో బైడెన్‌ కన్నా, కమలా హ్యారిస్‌కే ఎక్కువ.. ట్రంప్‌

జో బైడెన్‌ కన్నా, కమలా హ్యారిస్‌కే ఎక్కువ.. ట్రంప్‌

విషయ గ్రహణలో, అవగాహనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కన్నా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ కే ఎక్కువ లోపాలు, సమస్యలు ఉన్నాయని రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జార్జియా ఎన్నికల ప్రచార సభలో పేర్కొన్నారు. ట్రంప్‌తో టీవీ చర్చలో తడబడిన బైడెన్‌ ఆ తరువాత పోటీ నుంచి తప్పుకోవడంతో పాలక డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా కమల ముందుకొచ్చారు. నవంబరు 5న జరిగే అధ్యక్ష ఎన్నికలో కమలా హ్యారిస్‌ తనపై గెలుస్తుందని ఎవరూ అనుకోవడం లేదని, అందుకే ఆమెను చూసి ప్రపంచమంతా నవ్వుతోందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్ష పదవిలో లేకపోవడం వల్లనే రష్యా`ఉక్రెయిన్‌ యుద్ధం పశ్చిమాసియాలో హమాస్‌ `ఇజ్రాయెల్‌ యుద్ధం జరుగుతున్నాయని హంగరీ అధ్యక్షుడు విక్తొర్‌ ఓర్బన్‌ చెప్పారని ఆయన తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :