ASBL Koncept Ambience
facebook whatsapp X

కూటమికి కొరకరాని కొయ్యగా మారిన రుషికొండ ప్యాలెస్..

కూటమికి కొరకరాని కొయ్యగా మారిన రుషికొండ ప్యాలెస్..

రిషికొండ (Rushikonda) పేరు చెప్తే అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలు కళ్ళ ముందు మెదులుతాయి. అయితే జులాయి (Julayi movie) సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్టుగా అద్భుతమైన రిషికొండపై కూర్చొని కానీ ఏలేయాలి అని కలగన్నట్టున్నాడు జగన్( Jagan). అందుకే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే రిషి కొండపై కాటేజీలు పాత పడ్డాయి అనే నేపంతో కొత్త కన్స్ట్రక్షన్ ని ప్రారంభించారు. నిజానికి 1980 దశకం లోని ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) గారు రిషికొండను పర్యటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అక్కడ కాటేజీలను కట్టించారు.

అయితే 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ సుమారు మూడు సంవత్సరాల పాటు ఇనుప కంచల వెనుక భారీ కట్టడాలను కట్టించారు. నిజానికి మూడు సంవత్సరాలు రిషికొండలో ఏం జరిగిందో కూడా ఎవరికీ తెలీదు.. అంత సీక్రసీ మెయింటైన్ చేశారు. కానీ బ్రహ్మాండంగా ఉన్న పాత కాటేజీలను కొట్టేయడంపై టీడీపీ(TDP ) జనసేన(Janasen)  సహా వామపక్షాలు ప్రభుత్వంపై మండిపడ్డాయి. అయినా రిషికొండ ప్యాలెస్ ( Rushikonda Palace) విషయంలో జగన్ ఎవరి మాట వినలేదు. 

కట్ చేస్తే ఇప్పుడు రిషికొండను ఏం చేయాలో కూడా ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. అసలు ఆ పేరు చెబితేనే అమ్మ బాబోయ్ అనేలా ఉంది పరిస్థితి. విశాఖ టు భీమిలి వెళ్లే రూట్లో ఉన్న ఈ రిషికొండపై ఎత్తైన కొండల నుంచి నీలి సముద్రాన్ని చూస్తే ఆ మజా డిఫరెంట్ గా ఉంటుంది. అయితే అద్భుతమైన పర్యాటక ప్రదేశాన్ని చేయాల్సిన ఆ ప్రాంతంలో వందల కోట్ల రూపాయల వ్యయంతో రాజప్రసాదాలను నిర్మించారు. విశాఖను రాజధానిగా చేసుకొని ఆంధ్రాను పరిపాలించాలి అని భావించారో ఏమో కానీ జగన్ మొత్తానికి రిషికొండపై ఓ రేంజ్ సెటప్ ను చేసి సిద్ధం చేశారు.

అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్డింగులను ఏం చేయాలో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రభుత్వం తరఫున కట్టే బిల్డింగులకు ఇంత ఖర్చు పెడతారు అని అందరూ నోళ్ళు నొక్కుకునే పరిస్థితి ఏర్పడింది.ఆ ప్యాలెస్ కు రోజువారి నిర్వహణ ఖర్చు లక్ష రూపాయల దాకా అవుతుందట.. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల కాలంలో కేవలం ఆ ప్యాలెస్ కోసం సుమారు అరకోటి వరకు ఖర్చవుతుంది. దాని మీద రూపాయి ఆదాయం లేదు కానీ ఖర్చు మాత్రం ఆకాశాన్ని తాకుతుంది. దేనికైనా ఉపయోగిద్దామా అంటే ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు.. దీంతో ప్రస్తుతం ఇది కూటమి ప్రభుత్వానికి తెల్లయ్యనుగా మారిపోయింది. మరోపక్క అసలు ఈ భవన నిర్మాణం వెనుక జగన్ ఉద్దేశం ఏమిటి అనే విషయం కూడా అర్థం కావడం లేదు.. మొత్తానికి వైసీపీ హయాంలో జరిగిన అవినీతికి ఈ పాలస్ నిలువెత్తు నిదర్శనం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :