ASBL Koncept Ambience
facebook whatsapp X

ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్.. రష్యాతో సంబంధాలు మెరుగుపడేనా..?

ట్రంప్ కు విషెస్ చెప్పని పుతిన్.. రష్యాతో సంబంధాలు మెరుగుపడేనా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు ప్రకటించుకున్న డొనాల్డ్ ట్రంప్ కు ప్రపంచ దేశాల అధినేతలందరి నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మాత్రం తమకు ట్రంప్ ను అభినందించే ఆలోచనేమీ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. సాదారణంగా ఏదేశాధ్యక్షుడైనా ఎన్నికైన తర్వాత.. ప్రపంచదేశాధినేతలు శుభాభినందనలు అందిస్తారు. మరి అగ్రరాజ్యానికి అధినేతగా ఎన్నికైన తర్వాత కూడా పుతిన్ విషెస్ చెప్పలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒక్కరోజులో ఆగేది కాదని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. ట్రంప్ పైనా తమకు పెద్దగా కలలేమి లేవన్నారు. అసలు ప్రస్తుతమున్న యుద్ధం.. ఈదిశగా సాగడానికి కారణం అమెరికా అని స్పష్టంచేశారు. అమెరికా విదేశాంగవిధానంలో ఏమైనా మార్పులు వస్తే.. అప్పుడే యుద్ధం ముగింపు సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు పెస్కోవ్. పుతిన్ తనకు గౌరవమిస్తారని.. అందుకే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని తాను 24 గంటల్లో ముగిస్తానని గతంలో ట్రంప్ స్పష్టం చేశారు.

అయితే .. అప్పుడే ఇది అంత ఈజీ కాదని క్రెమ్లిన్ వర్గాలు తెలిపాయి. మరి ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రష్యాతో రిలేషన్స్ ఎలా ఉండనున్నాయి. యుద్ధాన్ని ఎలా ఆపగలరు..? ఎందుకంటే ఈ యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తుంది నాటో దేశాలు.వాటికి వెన్నుదన్నుగా ఉంది అమెరికా. మరి ఇప్పుడు అదే యుద్ధాన్ని ఆపాలంటే అమెరికా ఏం చేయనుంది? ఉక్రెయిన్‌తో వైఖరి విషయంలో రష్యా, యుఎస్ మధ్య సంబంధాలు చాలా క్షీణించి ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ కు ఆయుధ సరఫరా నుంచి నిధుల సాయం వరకూ అన్నింటా అమెరికా ప్రధాన పాత్ర పోషిస్తోంది. అంతేకాదు.. అమెరికా మిత్రదేశాల నుంచి సైతం ఉక్రెయిన్ కు ఆయుధ సాయం అందుతోంది.

ఇలాంటి సమయంలో పుతిన్ నుంచి బహుశా.. ఇంతకు మించి స్పందన ఉండకపోవచ్చన్నది రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం. ట్రంప్ ను పుతిన్ అంత ఈజీగా నమ్మేవ్యక్తి కాదంటారు ఆయన గురించి తెలిసిన వ్యక్తులు. తమదేశప్రయోజనాలే లక్ష్యంగా ట్రంప్ అడుగులుంటాయి. మరి .. ఇప్పుడు వెనక్కు తగ్గమంటే రష్యా తగ్గుతుందా...? ఇంత కోల్పోయిన తర్వాత ఉక్రెయిన్ మాత్రం.. ఆగుతుందా..? ఈ విషమ పరీక్షను ట్రంప్ ఎలా ఆపుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.2020 ఎన్నికల విజయంపై జో బిడెన్‌ను అభినందించిన చివరి నాయకులలో పుతిన్ ఒకరు, ఓటు వేసిన ఆరు వారాల తర్వాత తన అభినందన సందేశాన్ని పంపారు.

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :